మోడీ సర్కార్ మునిగిపోతున్న నావ

అందుకే ఆర్‌ఎస్‌ఎస్ కూడా వదిలేసింది: మాయావతి లక్నో: మోడీ ప్రభుత్వం మునిగిపోతున్న నావ అని, అందుకే దాని సైద్ధాంతిక కర్త అయిన ఆర్‌ఎస్‌ఎస్ కూడా దాన్ని వదిలేసిందని బిఎస్‌పి అధినేత్రి మాయావతి అన్నారు. దేశానికి ఇప్పుడు కావలసింది చాయ్‌వాలాలు, చౌకీదార్ లు కాదని, నిజమైన ప్రధాని అని కూడా ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు గుళ్లను సందర్శించడం ఒక ఫ్యాషనై పోయిందని ఆమె అంటూ, ఎన్నికల కమిషన్ దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ‘నరేంద్ర […] The post మోడీ సర్కార్ మునిగిపోతున్న నావ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అందుకే ఆర్‌ఎస్‌ఎస్ కూడా వదిలేసింది: మాయావతి
లక్నో: మోడీ ప్రభుత్వం మునిగిపోతున్న నావ అని, అందుకే దాని సైద్ధాంతిక కర్త అయిన ఆర్‌ఎస్‌ఎస్ కూడా దాన్ని వదిలేసిందని బిఎస్‌పి అధినేత్రి మాయావతి అన్నారు. దేశానికి ఇప్పుడు కావలసింది చాయ్‌వాలాలు, చౌకీదార్ లు కాదని, నిజమైన ప్రధాని అని కూడా ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు గుళ్లను సందర్శించడం ఒక ఫ్యాషనై పోయిందని ఆమె అంటూ, ఎన్నికల కమిషన్ దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ‘నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక మునిగిపోతున్న నావ. ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. దీనికి అతి పెద్ద నిదర్శనం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్ కూడా వాళ్లను వదిలయడమే’నని మాయావతి మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదని కూడా ఆమె అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ‘ఝోలాలు’(సంచులు) తగిలించుకొని ఎన్నికల ప్రచారంలో కష్టపడడం ఎక్కడా కనిపించడం లేదు. హామీలు నెరవేర్చకపోవడం. జనం వారిపట్ల తీవ్ర ఆగ్రహంతో ఉండడమే దీనికి కారణం. అందుకే మోడీ చెమటలు కక్కుతున్నారు’ అని మాయావతి అన్నారు. ద్వంద్వ వ్యక్తిత్వంతో దేశ ప్రజలను ఇక ఎంతమాత్రం మోసం చేయలేరని మాయావతి అన్నారు. ‘దేశం ఇప్పటికే సేవకులు, ముఖ్య సేవకులు, చాయ్‌వాలాలు, చౌకీదార్ల రూపంలో చాలా మంది నేతలను చూసింది. అయితే దేశానికి ఇప్పుడు కావలసింది దాన్ని సమర్థవంతంగా నడపగల నిజమైన ప్రధానమంత్రి’ అని ప్రధాని మోడీతో ముడిపడి ఉన్న లేబుళ్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ మాయావతి అన్నారు. ఇలాంటి ద్వంద్వ వ్యక్తిత్వాలతో దేశ ప్రజలు ఇప్పటికే మోసపోయారని, ఇక ఎంతమాత్రం మోసపోరని అన్నారు. కాగా, ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించినందుకు ప్రచారం చేయకుండా నిషేధించిన వ్యక్తులు ఆలయాలను సందర్శించడాన్ని కూడా నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు.

RSS deserting Modi Govt says Mayavati

The post మోడీ సర్కార్ మునిగిపోతున్న నావ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: