గర్భిణి భార్య, ఆరేళ్ల కుమారుడు సహా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దారుణ హత్య

కోల్‌కతా: ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తతోపాటు ఎనిమిది మాసాల గర్భంతో ఉన్న ఆయన భార్యను, వారి ఆరేళ్ల కుమారుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. మంగళవారం మధ్యాహ్నం ముర్షిదాబాద్ జిల్లాలోని జియాగంజ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ప్రకాశ్ రాజ్(35), ఆయన భార్య బ్యూటీ పాల్(28), వారి కుమారుడు అంగన్ పాల్(6) హత్యకు గురయ్యారు. వారి ముగ్గురి దేహాలపై కత్తిపోట్లు ఉండగా పిల్లవాడిని టవలుతో గొంతు నులిమి కూడా చంపారు. ఉదయం 11 గంటలకు స్థానిక మార్కెట్ నుంచి ఇంటికి […] The post గర్భిణి భార్య, ఆరేళ్ల కుమారుడు సహా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోల్‌కతా: ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తతోపాటు ఎనిమిది మాసాల గర్భంతో ఉన్న ఆయన భార్యను, వారి ఆరేళ్ల కుమారుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. మంగళవారం మధ్యాహ్నం ముర్షిదాబాద్ జిల్లాలోని జియాగంజ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ప్రకాశ్ రాజ్(35), ఆయన భార్య బ్యూటీ పాల్(28), వారి కుమారుడు అంగన్ పాల్(6) హత్యకు గురయ్యారు.

వారి ముగ్గురి దేహాలపై కత్తిపోట్లు ఉండగా పిల్లవాడిని టవలుతో గొంతు నులిమి కూడా చంపారు. ఉదయం 11 గంటలకు స్థానిక మార్కెట్ నుంచి ఇంటికి తిరివచ్చిన ప్రకాశ్ పాల్ గంటలోపలే హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. కనాయ్‌గంజ్ లెబుతలాలోని వారి నివాసంలో మృతదేహాలు లభించినట్లు వారు చెప్పారు. ప్రకాశ్ పాల్ ఒక ప్రాథమిక పాఠశాలలో టీచరుగా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన సొంత ఇల్లు కట్టుకున్నారు.

RSS activist Murdered alongwith his wife and son, Prakash Pal was found murdered along with his eight month pregnant wife and six year old son in Bengals Murshidabad district

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గర్భిణి భార్య, ఆరేళ్ల కుమారుడు సహా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: