ట్రంప్ పర్యటనకు రూ.8కోట్లు మాత్రమే ఖర్చు చేశాం: గుజరాత్ సిఎం

 

గాంధీనగర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటనకు గుజరాత్ రాష్ట్రం ప్రభుత్వం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఖండించారు. ట్రంప్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని సిఎం విజయ్ రూపానీ శుక్రవారం అసెంబ్లీకి తెలియజేశారు. ట్రంప్ పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు చేశారని వారు మాట్లాడుతుండటం తనకు చాలా అశ్చర్యమేసిందని  అన్నారు. వారికి ఈ సంఖ్య ఎక్కడ నుండి వచ్చిందో తనకు తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కేవలం రూ.8 కోట్లు మంజూరు చేయబడ్డాయని, అందులో రూ.4.5 కోట్లు రోడ్ల కోసం ఎఎంసి(అహ్మదాబాద్ పున్సిపల్ కార్పోరేషన్) ఖర్చు చేసిందని సిఎం విజయ్ రూపానీ తెలిపారు.

Rs 8 Cr Spent for Donald Trump’s Visit: Vijay Rupani

The post ట్రంప్ పర్యటనకు రూ.8కోట్లు మాత్రమే ఖర్చు చేశాం: గుజరాత్ సిఎం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.