తండ్రి తరపున లంచం తీసుకుంటూ పట్టుబడిండు

  హైదరాబాద్‌లోని కోఠిలో ఆరున్నర లక్షలతో ఎసిబి వలలో వేములవాడ అధికారి కుమారుడు మన తెలంగాణ/హైదరాబాద్: వేములవాడ ఆలయ అభివృద్ధి ముఖ్య ప్రణాళికాధికారి(విటిడిఒ) టి.లక్ష్మణ్‌గౌడ్ కుమారుడు రోహిత్ హైదరాబాద్‌లోని కోఠిలో రూ.6.50లక్షలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..వేములవాడకు చెందిన సంపత్ అనే రియల్టర్ రుద్రా రం గ్రామ పరిధిలో ఎనిమిది ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమికి సంబంధించి లేఅవుట్ అనుమతి కోసం వేములవాడ ఆలయ అభివృద్ధి ముఖ్య ప్రణాళికాధికారి టి.లక్ష్మణ్‌గౌడ్ […] The post తండ్రి తరపున లంచం తీసుకుంటూ పట్టుబడిండు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌లోని కోఠిలో ఆరున్నర లక్షలతో ఎసిబి వలలో వేములవాడ అధికారి కుమారుడు

మన తెలంగాణ/హైదరాబాద్: వేములవాడ ఆలయ అభివృద్ధి ముఖ్య ప్రణాళికాధికారి(విటిడిఒ) టి.లక్ష్మణ్‌గౌడ్ కుమారుడు రోహిత్ హైదరాబాద్‌లోని కోఠిలో రూ.6.50లక్షలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..వేములవాడకు చెందిన సంపత్ అనే రియల్టర్ రుద్రా రం గ్రామ పరిధిలో ఎనిమిది ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమికి సంబంధించి లేఅవుట్ అనుమతి కోసం వేములవాడ ఆలయ అభివృద్ధి ముఖ్య ప్రణాళికాధికారి టి.లక్ష్మణ్‌గౌడ్ ను ఆశ్రయించాడు. ఈక్రమంలో అనుమతి మంజూరు చేయాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని చీఫ్ ప్లానింగ్ అధికారి లక్ష్మణ్‌గౌడ్ రియాల్టర్ సంపత్‌ను డిమాండ్ చేశాడు. చివరకు వీరిద్దరి మధ్య జరిగిన బేరసారాలలో రూ.6.50లక్షలు లంచం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌గౌడ్ రూ.6.50లక్షలు లంచం మొత్తాలు హైదరాబాద్‌లోని కోఠి, ఆర్‌కెఎస్ లేన్, సుల్తాన్‌బజార్‌లోని ఇంటి నం.4.3.210/1 రావాలని తెలిపాడు. దీంతో రియాల్టర్ సంపత్ తన భూమికి సంబంధించి లేఅవుట్ అనుమతి కోసం లంచం ఇచ్చే విషయంపై తన మిత్రుడైన సందీప్‌తో చర్చించాడు.

చట్టబద్దంగా ఉన్న తన భూమికి లే అవుట్ అనుమతికి రూ.6.50లక్షలు లంచం డిమాండ్ చేసిన టి.లక్ష్మణ్‌గౌడ్‌ను అవినీతి అధికారులకు పట్టించాలని రియాల్టర్లు సంపత్, సందీప్‌లు పథకం రచించారు. వెనువెంటనే రియాల్టర్ సంపత్, సందీప్‌లు తమను లంచం డిమాండ్ చేసిన లక్ష్మణ్‌గౌడ్ వ్యవహారాన్ని ఎసిబి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు న్యాయం చేయాలని ఎసిబికి ఫిర్యాదు చేశారు. రియాల్టర్ సంపత్ ఒప్పందం ప్రకారం రూ.6.50లక్షల మొత్తాలతో విటిడిఒ లక్ష్మణ్‌గౌడ్‌ఇంటికి చేరుకున్నాడు. కాగా తాను ఇంట్లో లేనని, లంచం మొత్తాలను తన కుమారుడు రోహిత్‌కు అందజేయాలని లక్ష్మణ్‌గౌడ్ రియాల్టర్ సంపత్‌కు సూచించాడు. అప్పటికే లక్ష్మణ్‌గౌడ్ ఇంటి సమీపంలో మాటువేసిన ఎసిబి అధికారులు రూ.6.50లక్షల నగదు లంచం తీసుకుంటుండగా లక్ష్మణ్‌గౌడ్ కుమారుడు రోహిత్‌ను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నగరంలోని బేగంపేట్‌లోని జి.ఎంసి బాలయోగి పర్యాటక భవన్‌లోని ఉన్న లక్ష్మణ్‌గౌడ్‌ను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ నుంచి నగదు స్వాధీనం చేసుకుని అనంతరం విటిడిఒ లక్ష్మణ్‌గౌడ్, అతని కుమారుడు రోహిత్‌లను అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు తండ్రి, కుమారులకు రిమాండ్ విధించినట్లు ఎసిబి డిఎస్‌పి భద్రయ్య తెలిపారు.

Rs.6.50 lakhs ACB officers seized in Koti

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తండ్రి తరపున లంచం తీసుకుంటూ పట్టుబడిండు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: