మాస్క్‌ ధరించలేదని రూ.500 జరిమాన

మనతెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రాకే గ్రామంలో ముఖానికి మాస్క్ ధరించలేదని ఓ యువకుడికి గ్రామ పెద్దలు రూ.500 జరిమానా విధించారు. రేషన్ బియ్యం తీసుకోవడానికి ఓ యువకుడు మాస్కు ధరించకుండా రావడాన్ని గమనించిన గ్రామ సర్పంచ్ మీనాక్షి అతనికి రూ.500 జరిమానా విధించింది. ప్రతి ఒక్కరు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మాస్కులు తప్పనిసరి ధరించాలని గ్రామ సర్పంచ్ ఆదేశించింది. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించి కరోనాను తరిమికొట్టాల గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ వైరస్ ని తరిమికొట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా కొత్తవారు ఇతర గ్రామాల నుంచి తమ గ్రామానికి వస్తే వారి పూర్తివివరాలను సేకరిస్తున్నారు. అత్యవసరం అనుకుంటనే వారిని గ్రామంలోకి అనుమతిస్తున్నారు. ప్రజలంతా ఒకే తాటిపై ఉండి నిబంధనలను పాటిస్తున్నారు. ఎవరైనా అనుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే వారు మరోసారి అలాంటి పొరపాటు చేకుండా ఉండేందుకు జరిమానాలు విధిస్తున్నారు.

Rs 500 fine for not wearing mask in Adilabad

The post మాస్క్‌ ధరించలేదని రూ.500 జరిమాన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.