3 చెట్లు నరికినందుకు 39 వేలు జరిమానా..

మనతెలంగాణ, హైదరాబాద్: భవన నిర్మాణానికి అడ్డు ఉన్నాయని మూడు చెట్లను నరికిన ఓ భవన యజమానికి అటవీశాఖ అధికారులు జరిమానా విధించిన సంఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది. అటవీ శాఖ అధికారుల కథనం ప్రకారం.. నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న ఓ భవన యజమాని అటవీ అధికారుల అనుమతి లేకుండా మూడు చెట్లను నరికాడు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా చెట్లు నిర్మాణానికి […] The post 3 చెట్లు నరికినందుకు 39 వేలు జరిమానా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ, హైదరాబాద్: భవన నిర్మాణానికి అడ్డు ఉన్నాయని మూడు చెట్లను నరికిన ఓ భవన యజమానికి అటవీశాఖ అధికారులు జరిమానా విధించిన సంఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది. అటవీ శాఖ అధికారుల కథనం ప్రకారం.. నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న ఓ భవన యజమాని అటవీ అధికారుల అనుమతి లేకుండా మూడు చెట్లను నరికాడు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా చెట్లు నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని భవనం యజమాని మూడు చెట్లను నరికించారు.

అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు రావడంతో వెంటనే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. మూడు చెట్లు నరికినట్లు విచారణలో తేలడంతో భవన యజమానికి గత నెల 7వ తేదీన అటవీశాఖ అధికారులు రూ.39,060 జరిమానా విధించారు. భవన యజమాని ఈ నెల 9వ తేదీన జరిమానా చెల్లించారు. హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వం మొక్కలను నాటుతుండగా, మరోవైపు పలువురు చెట్లను నరికివేయడంతో కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో చెట్లు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయని అటవీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Rs.39 thousands Fine for cutting down trees in Hyd

The post 3 చెట్లు నరికినందుకు 39 వేలు జరిమానా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: