కల్కి ఆశ్రమాలలో గుట్టలుగా నోట్ల కట్టలు!

చెన్నై: స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్‌కు చెందిన ఆశ్రమాలు, ఇతర ప్రదేశాలలో సోదాలు జరిపిన ఆదాయం పన్ను అధికారులకు రూ.30 కోట్లకు పైగా విలువైన కరెన్సీ కట్టలు లభించాయి. కల్కి ఆశ్రమాలతోపాటు, అతని కుమారుడు కృష్ణకు చెందిన వ్యాపార సంస్థలకు 40 స్థావరాలపై ఐటి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించగా రూ.9 కోట్లకు పైగా విలువైన అమెరికన్ డాలర్లు కూడా లభించినట్లు ఐటి అధికారి ఒకరు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంతోపాటు చెన్నైలోని ఆశ్రమంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఒన్‌నెస్ యూనివర్సిటీని స్థాపించిన కల్కి భగవాన్ అలియాస్ విజయకుమార్ నాయుడుకు హైదరాబాద్‌లోని ఒక తెలుగు టివి చానెల్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఐటి అధికారులు అక్కడ కూడా సోదాలు జరిపారు. చెన్నై, చిత్తూరులో భారీ మొత్తంలో నగదుతో పాటు భూలావాదేవీలకు సంబంధించిన పత్రాలు, వ్యాపార లావాదేవీలకు చెందిన పత్రాలు లభించాయి.

 
Rs 30 cr unearthed from Kalki Ashrams in IT raids, The raids carried on Kalki Bhagwans properties in AP, Telangana and Tamil Nadu

The post కల్కి ఆశ్రమాలలో గుట్టలుగా నోట్ల కట్టలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.