పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి కెటిఆర్

Rs 2 lakh insurance for TRS Activists

హైదరాబాద్: లక్షలాది కార్యకర్తల శ్రమ, త్యాగాల వల్లే టిఆర్ఎస్ పార్టీ గొప్పగా ముందుకెళ్తొందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. 13 ఏళ్లలో కార్యకర్తలు ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొని అధిగమించారు. కెసిఆర్ సంకల్ప బలం, ముహుర్తం వల్లే పార్టీ అజేయశక్తిగా ఆవిర్భవించింది. పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకు కార్యకర్తల బీమా కోసం రూ.47.65 కోట్లు చెల్లించాం. కార్యకర్తల సంక్షేమం కోసం మరికొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొస్తాం. కార్యకర్తల కృషితో టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. టిఆర్ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణం 90శాతం పూర్తయ్యాయి. కరోనా పరిస్థితుల వల్లే కార్యకర్తల శిక్షణను వాయిదా వేశాం. నాపుట్టినరోజు సందర్భంగా అంబులెన్స్ లు ఇచ్చాం” అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.