శామ్‌సంగ్ M సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్

Samsung M series

 

న్యూఢిల్లీ : చైనా కంపెనీల నుంచి వస్తున్న పోటీని దృష్టిలో పెట్టుకుని శామ్‌సంగ్ గెలాక్సీ ‘M’ సిరీస్ ఫోన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఫోన్లలో ఎం30, ఎం20 ఫోన్లపై కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది. అటు శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్ వెబ్‌సైట్‌లో వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇటీవల అమెజాన్ వెబ్‌సైట్‌లో నిర్వహించిన ఫ్రీడమ్ సేల్‌లో అందించిన డిస్కౌంట్‌నే మళ్లీ అందిస్తున్నారు. ఎం20 మోడల్‌ను శామ్‌సంగ్ ఈ ఏడాది జనవరిలో తీసుకురాగా.. ఎం30 ఫోన్‌ను అక్కడికి నెల తర్వాత విడుదల చేసింది. ఇందులో ఎం30 4జీబీ/ 64 జీబీ వేరియంట్ ధరను విడుదల సమయంలో 14,990గా పేర్కొనగా.. తాజాగా దాన్ని 13,990కి తగ్గించారు.

ఇక 6జీబీ/128జీబీ వేరియంట్ ధరను రూ.17,990 నుంచి రూ.16,990కి తగ్గించారు. ఎం20 మోడల్ 3జీబీ/32జీబీ వేరియంట్ ధర రూ.10,990 నుంచి రూ.9,990కి తగ్గించారు. 4జీబీ/64జీబీ వేరియంట్ ధరను రూ.12,990 నుంచి రూ.11,990కి తగ్గించారు. వీటితో పాటు అమెజాన్.ఇన్ వెబ్‌సైట్‌లో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలుపై 5 డిస్కౌంట్ అదనంగా లభిస్తోంది. అటు అమెజాన్‌తో పాటు, శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఎక్స్‌ఛేంజ్ సదుపాయం కూడా లభిస్తోంది. శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఎం10 స్మార్ట్‌ఫోన్‌పైనా వెయ్యి రూపాయలు తగ్గింపు అందిస్తోంది. రియల్‌మీ నుంచి రియల్‌మీ 5, 5 ప్రో, షావోమీ నుంచి ఎంఐ ఏ3 ఫోన్లు త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో శామ్‌సంగ్ ఈ ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం.

RS 1000 Discount on Samsung M series phones in Amazon

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శామ్‌సంగ్ M సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.