పేదలకు రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ

  80 కోట్ల పేదల ప్రజలకు 10 కిలోల బియ్యం లేదా గోధుమలు, 1 కిలో పప్పు వచ్చే మూడు నెలలపాటు ఉచితం పేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆరోగ్య కార్యకర్తలకు రూ.50 లక్షల ఆరోగ్య బీమా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ సహాయ ప్యాకేజీని ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద నగదు బదిలీ, ఆహార భద్రత రెండు […] The post పేదలకు రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

80 కోట్ల పేదల ప్రజలకు 10 కిలోల బియ్యం లేదా గోధుమలు, 1 కిలో పప్పు
వచ్చే మూడు నెలలపాటు ఉచితం
పేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు
ఆరోగ్య కార్యకర్తలకు రూ.50 లక్షల ఆరోగ్య బీమా
లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ సహాయ ప్యాకేజీని ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద నగదు బదిలీ, ఆహార భద్రత రెండు భాగాల్లో రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని అందిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో సామాన్య ప్రజలు, ముఖ్యంగా పేదలు బాధపడకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ వివరాలను వెల్లడించారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ఆందోళన చెందుతున్న పేదలు, వలస కార్మికుల సంక్షేమం దృష్టా భారీ ఆర్థిక సహాయ ప్యాకేజీని అందిస్తున్నామని అన్నారు. ఈ ప్యాకేజీ విలువ రూ .1.70 లక్షల కోట్లని తెలిపారు. గ్రామాలు, నగరాల్లో నివసించే పేదలు ఆకలితో బాధపడకూడదనేది తమ ప్రయత్నమని అన్నారు. దీని కింద పేదలకు ప్రతి నెలా 10 కిలోల ఉచిత ధాన్యం, అలాగే రైతులకు ఆర్థిక సహాయం కేంద్రం అందిస్తామన్నారు. మహిళలు, వృద్ధులు, ఉద్యోగుల కోసం కూడా ఆర్థికమంత్రి ప్రకటనలు చేశారు.

సహాయ ప్యాకేజీ ముఖ్యాంశాలు
ఆశా కార్మికులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి రూ.50 లక్షల బీమా.
80 కోట్ల మంది పేద ప్రజలకు 3 నెలలపాటు 5 కిలోల గోధుమలు, బియ్యం, ఇప్పటికే ఇస్తున్న 5కిలోలకు అదనం.
దీంతోపాటు 1 కిలో పప్పు సరఫరా చేయనున్న ప్రభుత్వం.
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మొదటి విడతగా ఏప్రిల్ మొదటి వారంలో రూ.2000.
ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం రూ.182 నుంచి రూ.202 పెంపు.
వృద్ధులు, పేద వితంతువులు, వికలాంగులకు రెండు విడతలుగా రూ .1000.
ఉజ్వల పథకం ద్వారా లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు.
20 కోట్ల మంది మహిళా ధన్ ఖాతాదారులకు రూ.500 చొప్పున మూడు నెలలపాటు.
డ్వాక్రా గ్రూపులకు ష్యురిటీ లేకుండా రుణాలు.
డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.
ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లిస్తుంది.
90 శాతం మంది ఉద్యోగులు రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఇది వర్తిస్తుంది.
పిఎఫ్ ఖాతాల నుంచి 75 శాతం డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం.
భవన నిర్మాణ కార్మికులకు రూ.31 వేల కోట్లు కేటాయింపు.
రాష్ట్రాలకు కేటాయించిన మినరల్ ఫండ్‌ను కరోనా వైద్య పరీక్షల కోసం వినియోగించుకోవాలన్న కేంద్రం.
ఈ రూ .1.7 లక్షల కోట్ల ప్యాకేజీ తక్షణమే అమల్లోకి వస్తుంది, ఏప్రిల్ 1 నుంచి నగదు సహాయం లభిస్తుంది.

Rs 1.7 lakh crore to poor and migrant workers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పేదలకు రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: