‘ఆర్‌ఆర్‌ఆర్’ హైద్రాబాద్‌లోనే.!

  తొలి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ’ఆర్‌ఆర్‌ఆర్’ మూడో షెడ్యూల్‌ని గుజరాత్‌లో ప్లాన్ చేశారు. అయితే, అనుకోకుండా, చరణ్ కాలికి గాయం కావడంతో ఈ షెడ్యూల్‌ని మూడు వారాల పాటు వాయిదా వేశారు. దాంతో గుజరాత్ షెడ్యూల్ వాయిదా పడిపోయింది. ఇక ఇప్పుడు మూడో షెడ్యూల్ కోసం రంగం సిద్ధం చేస్తోంది ’ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్. అయితే గుజరాత్ షెడ్యూల్ కాదట. ఈ తాజా షెడ్యూల్‌ని హైద్రాబాద్‌లోనే ప్లాన్ చేశారట. హైద్రాబాద్ శివార్లలో నిర్మించిన ఓ భారీ […] The post ‘ఆర్‌ఆర్‌ఆర్’ హైద్రాబాద్‌లోనే.! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తొలి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ’ఆర్‌ఆర్‌ఆర్’ మూడో షెడ్యూల్‌ని గుజరాత్‌లో ప్లాన్ చేశారు. అయితే, అనుకోకుండా, చరణ్ కాలికి గాయం కావడంతో ఈ షెడ్యూల్‌ని మూడు వారాల పాటు వాయిదా వేశారు. దాంతో గుజరాత్ షెడ్యూల్ వాయిదా పడిపోయింది. ఇక ఇప్పుడు మూడో షెడ్యూల్ కోసం రంగం సిద్ధం చేస్తోంది ’ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్. అయితే గుజరాత్ షెడ్యూల్ కాదట. ఈ తాజా షెడ్యూల్‌ని హైద్రాబాద్‌లోనే ప్లాన్ చేశారట. హైద్రాబాద్ శివార్లలో నిర్మించిన ఓ భారీ సెట్‌లో ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరపనున్నారట.

ఈ షెడ్యూల్ కోసం రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ గాయాల నుండి తేరుకుని షూటింగ్‌కి సిద్ధంగా ఉన్నారట. ఇకపోతే, గుజరాత్ షెడ్యూల్‌ని ఎప్పుడు ప్రారంభిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ’బాహుబలి’ చిత్రాల తర్వాత రాజమౌళి నుండి వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ’ఆర్‌ఆర్‌ఆర్’.ఎన్టీఆర్ కొమరంభీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు ఈ సినిమాలో. డివివి దానయ్య ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. అలియాభట్ రామ్‌చరణ్‌కి జోడీగా నటించనుంది. అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎన్టీఆర్‌తో జోడీ కట్టే భామ కోసం ఇంకా వేట అలాగే కొనసాగుతోంది.

RRR movie unit ready for Shooting

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘ఆర్‌ఆర్‌ఆర్’ హైద్రాబాద్‌లోనే.! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: