హైదరాబాద్ లో రౌడీషీటర్ హత్య

Murderహైదరాబాద్‌ : నగరంలోని బోరబండలో సోమవారం అర్థరాత్రి పోచి అలియాస్ నరసింహదాస్ గౌడ్ అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. శివాజీనగర్‌కు చెందిన పోచి అలియాస్ నరసింహదాస్ గౌడ్ ను దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. పాత కక్షల కారణంగానే నరసింహ దాస్ ను దుండగులు హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం నరసింహదాసు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నరసింహదాసు పై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

Rowdy Sheeter Murder In Borabanda At Hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హైదరాబాద్ లో రౌడీషీటర్ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.