వరంగల్ లో రౌడీషీటర్ అరెస్టు

వరంగల్ క్రైం: బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీషీటర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఈ రౌడీ షీటర్ నుంచి రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసులకు అందిన సమాచారంతో హన్మకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తూరు జెండా ప్రాంతానికి చెందిన రౌడీషీటర్  విక్రమ్ ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీస్ అధికారులు  దాడులు చేసినట్టు సిపి తెలిపారు. రౌడీషీటర్ విక్రమ్ […] The post వరంగల్ లో రౌడీషీటర్ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వరంగల్ క్రైం: బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీషీటర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఈ రౌడీ షీటర్ నుంచి రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసులకు అందిన సమాచారంతో హన్మకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తూరు జెండా ప్రాంతానికి చెందిన రౌడీషీటర్  విక్రమ్ ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీస్ అధికారులు  దాడులు చేసినట్టు సిపి తెలిపారు. రౌడీషీటర్ విక్రమ్ ఇంట్లో రెండు కత్తులు లభ్యం కావడంతో అదుపులోకి తీసుకొని హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సిపి పేర్కొన్నారు. అరెస్ట్‌యిన రౌడీషీటర్‌ విక్రమ్ ను పోలీసులు విచారించారని,  సతీష్ అనే వ్యక్తిని భూమి వివాదంలో  చంపుతానని విక్రమ్  బెదిరించడంతోపాటు అతని కారును ధ్వంసం చేసినట్టు రౌడీషీటర్ విక్రమ్ అంగీకరించినట్టు తమ విచారణలో తేలిందని సిపి విశ్వనాథ్ రవీందర్ తెలిపారు. ఈ సంఘటనపై రౌడీషీటర్ విక్రమ్‌పై హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపారు. నిందితుడు విక్రమ్ ను  పిటి వారెంట్‌పై పోలీస్ కస్టడీ తీసుకుంటామని ఆయన తెలిపారు. విక్రమ్ మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ల్యాండ్ సెటిల్‌మెంట్‌కు పాల్పడడంతో దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. విక్రమ్‌పై కార్పొరేటర్ అనిశెట్టి మురళీ హత్యతో పాటు 2007, 2018 ల్లో బెదిరింపు కేసులు నమోదయ్యాయని సిపి చెప్పారు.  రౌడీషీటర్ విక్రమ్‌పై పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని సిపి విశ్వనాథ్ రవీందర్ తెలిపారు.

 భూకబ్జా ఫిర్యాదులపై ప్రత్యేక విచారణ సెల్ ఏర్పాటు
రాష్ట్రంలోనే తొలిసారి భూకబ్జాలపై వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక విచారణ నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఫరిధిలో ఒక ఎసిపి స్థాయి ఆధ్వర్యంలో ఇద్దరు అనుభవజ్ఞులైన ఇన్స్‌పెక్టర్లతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ తెలిపారు.  సుదీర్ఘ కాలంగా ఉన్న స్థలాలలకు సంబంధించి తప్పుడు, ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి భూములను కబ్జాలకు పాల్పడుతున్నట్లుగా వచ్చే ఫిర్యాదులపై విచారించడం జరుగుతుందని సిపి తెలిపారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి నరసింహ, టాస్క్‌ఫోర్స్ ఎసిపి చక్రవర్తి, హన్మకొండ ఎసిపి శ్రీధర్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ నందిరాంనాయక్, హెడ్‌కానిస్టేబుళ్లు శ్యాం, కానిస్టేబుల్ శ్రీకాంత్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Rowdy Sheeter arrested in Warangal

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వరంగల్ లో రౌడీషీటర్ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: