పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం

  పరిశీలన, ప్రయో గం తదితర అంశాల ఆధారంగా సైన్స్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుండగా, సైన్స్ అనువర్తనాల ఆధారంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. సైన్స్ సిద్ధాంతాలు, సూత్రాలతో ముడిపడి ఉంటుంది. టెక్నాలజీ నూతన ఆవిష్కరణలకు ఊతం ఇస్తుంది. న్యూ టన్ ప్రతిపాదించిన 3వ గమన నియమం సైన్స్ పరిధిలోకి వస్తే, ఆ నియమం ఆధారంగా అంతరిక్షంలోకి పంపించబడుతున్న కృత్రిమ ఉపగ్రహాలు టెక్నాలజీ కోవలోకి వస్తాయి. మతం మధ్య యుగాలలో మారణ హోమా న్ని సృష్టించగా, ఆధునిక కాలంలో […] The post పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పరిశీలన, ప్రయో గం తదితర అంశాల ఆధారంగా సైన్స్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుండగా, సైన్స్ అనువర్తనాల ఆధారంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. సైన్స్ సిద్ధాంతాలు, సూత్రాలతో ముడిపడి ఉంటుంది. టెక్నాలజీ నూతన ఆవిష్కరణలకు ఊతం ఇస్తుంది. న్యూ టన్ ప్రతిపాదించిన 3వ గమన నియమం సైన్స్ పరిధిలోకి వస్తే, ఆ నియమం ఆధారంగా అంతరిక్షంలోకి పంపించబడుతున్న కృత్రిమ ఉపగ్రహాలు టెక్నాలజీ కోవలోకి వస్తాయి.

మతం మధ్య యుగాలలో మారణ హోమా న్ని సృష్టించగా, ఆధునిక కాలంలో సైన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు మతోన్మాదులు, సామ్రాజ్యవాదులు రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. నిత్య జీవితం లో సైన్స్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభు త్వం 1998లో జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. 1998 మే 11, 13 తేదీల్లో భారత దేశం రెండవ సారి అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. మన దేశంలో సాంకేతిక నిపుణులకు, శాస్త్రవేత్తలకు కొదవలేదు.

చంద్రయాన్ 1, మంగళయాన్, ఆపరేషన్ శక్తి, చంద్రయాన్ 2 తదితర ప్రయోగాల ద్వారా అంతరిక్ష పరిశోధన రంగంలో మన దేశం ఇతర అగ్ర దేశాల సరసన చేరింది. రక్షణ రంగంలో అగ్ని, బ్రహ్మోస్ వంటి క్షిపణులు రూపొందించుకొని స్వయం ప్రతిపత్తి సాధించాం. ఇస్రో ద్వా రా అనేక ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించగలుగుతున్నాము. అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించగలిగాము. “పరవ్‌ు” పేరుతో సూపర్ కంప్యూటర్‌ని రూపొందించగలిగాము. అదే సమయంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, వినియోగం మానవాళి ముందు అనేక సవాళ్ళను ఉంచుతుంది.

వైద్య రంగంలో యాంటీబయాటిక్స్, వ్యవసాయ రంగంలో పెస్టిసైడ్స్, రక్షణ రంగంలో వెపన్స్ మానవాళికే కాకుండా భూమిపై ఉన్న సకల జీవరాశుల ఉనికికి పెను ప్రమాదంగా మారాయి. 18వ శతాబ్దంలో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ఆశించిన స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఇవ్వలేకపోయినప్పటికీ, కాలుష్యాన్ని మాత్రం మనకు అరువుగా ఇవ్వగలిగింది. ఒకప్పుడు హరిత విప్లవం వలన ఉపయోగాలను మాత్రమే చదువుకున్నాము. ఇప్పు డు రసాయనిక ఎరువుల వినియోగం వలన వచ్చే నష్టాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సైన్స్ ద్వారా మశూచి వంటి భయంకర వ్యాధులను నిర్మూలించగలిగినప్పటికీ, తట్టు వంటి వ్యాధులు తిరిగి విజృంభిస్తున్నాయి. మధ్యయుగంలో మతాన్ని రాజులు, భూస్వాములు, మతాధికారులు తమ గుప్పిట్లో ఉంచుకోగా, ఆధునిక కాలంలో సైన్స్ పరిశోధనలు, వాటి ఫలాలని కార్పొరేట్‌లు, బడా పారిశ్రామిక వేత్తలు తమ ఆధీనంలో ఉంచుకోవడంతో పేద, ధనిక వర్గాల మధ్య మరింత వ్యత్యాసం పెరిగిందే తప్ప, తగ్గలేదు. ప్రస్తుతం పరిశోధనలు అన్నీ ఎక్కువగా రక్షణ, అంతరిక్ష, విమానయాన రంగాలలోనే జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఎక్కు వ నిధులను వాటికే కేటాయిస్తున్నాయి.

సైన్స్ టెక్నాలజీ రంగా ల్లో జరిగే పరిశోధనలు సామాన్యులు ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు చూపా లి. ఉగ్రవాదులు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రపం చ వ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు. ఇటీవల న్యూజిలాండ్‌లో మసీదుల పై, శ్రీలంకలో చర్చిలపై జరిగిన దాడుల్లో అమాయక ప్రజలే బలయ్యా రు. మరోవైపు ఆర్టిఫీిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తుంది. ఐతే శృతిమించి కృత్రిమ మేథస్సుపై ఆధారపడితే మానవుడిలోని సృజనాత్మకత, తార్కిక ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి. హ్యాకింగ్‌కి కూడా అవకాశం ఏర్పడుతుంది.

కంప్యూటరీకరణ వలన పేపర్ వినియోగం తగ్గినప్పటికీ, ఈ వేస్ట్ రూపంలో కాలుష్యం ప్రకృతిని కాటేస్తుంది. డైనమేట్, డిటోనేటర్ వంటి వాటిని కనుగొని కోట్లాది రూపాయలు సంపాదించిన ఆల్‌ఫ్రెడ్‌నోబెల్ తమ ఆస్తిని తమ పేరిట పురస్కారాలు ఇవ్వటానికి వీలుగా వీలునామా వ్రాశాడు. మానవాళికి ఉపకారం చేసే గొప్ప ఆవిష్కరణలు చేసిన వారికి పురస్కారాలు ఇవ్వాలని ఆయన సూచించాడు. నోబెల్ సూచించిన మార్గం నేటి పాలకులకు ఆదర్శం కావాలి. సైన్స్ పరిశోధనలు మానవ వికాసానికి దోహద పడాలే తప్ప, మానవ నాశనానికి కాదు.

Role of Science and Technology in the Developing World

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: