ప్రజాస్వామ్యంలో సామాన్యుల వాణి

  ప్రజాస్వామ్యంలో అందరి మాట కూ ఒకే రకమైన అవకాశం ఉంటుందని అనుకున్నా ప్రజాస్వామ్య జీవనంలో సామాన్యుల, అణగారిన వర్గాల స్వరం అన్న ప్రస్తావన ఉండనే ఉంటుంది. ఆదివాసుల, దళితుల, మైనారిటీల, శ్రామికుల స్వరం ఎప్పుడూ తక్కువ స్థాయిలోనే వినిపిస్తూ ఉంటుంది. ఈ వర్గాల వారే న్యాయం, సమానత్వం, గౌరవం కోసం మాట్లాడుతుంటారు. వివిధ ప్రభుత్వాల ఏలుబడిలో ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ స్వరాలను సాధారణంగా నిరాశాజనకమైన విగా పరిగణిస్తారు. వీరు ఎప్పుడు పేద అరుపులు అరుస్తూనే […] The post ప్రజాస్వామ్యంలో సామాన్యుల వాణి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రజాస్వామ్యంలో అందరి మాట కూ ఒకే రకమైన అవకాశం ఉంటుందని అనుకున్నా ప్రజాస్వామ్య జీవనంలో సామాన్యుల, అణగారిన వర్గాల స్వరం అన్న ప్రస్తావన ఉండనే ఉంటుంది. ఆదివాసుల, దళితుల, మైనారిటీల, శ్రామికుల స్వరం ఎప్పుడూ తక్కువ స్థాయిలోనే వినిపిస్తూ ఉంటుంది. ఈ వర్గాల వారే న్యాయం, సమానత్వం, గౌరవం కోసం మాట్లాడుతుంటారు. వివిధ ప్రభుత్వాల ఏలుబడిలో ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ స్వరాలను సాధారణంగా నిరాశాజనకమైన విగా పరిగణిస్తారు. వీరు ఎప్పుడు పేద అరుపులు అరుస్తూనే ఉంటారు అంటారు.

ప్రజాస్వామ్యంలో సామాన్యుల స్వరం మూడు కారణాల వల్ల ఎందుకూ కొరగాకుండా పోవచ్చు. మొదటిది చాలా మంది దృష్టిలో సామాన్యుల స్వరం ఆధునిక ప్రజాస్వామ్యంలో అసంబద్ధమైందిగా కనిపించవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సిద్ధాంత రీత్యా అన్ని స్వరాల వ్యక్తీకరణ సమానమైందే అనుకుంటారు. రాజ్యాంగంలో చెప్పింది ఇదేనని అనుకుంటాం. రెండవది సిద్ధాంత రీత్యా రాజ్య వ్యవస్థ భారత్ లోని ప్రజలందరి తరఫున మాట్లాడుతుంది. రాజ్యాంగపరంగా ఇలాంటి పరిస్థితి ఉంటే బలవంతుల స్వరానికి, బలహీనుల అంటే సామాన్యుల స్వరానికి ప్రజాస్వామ్యంలో తేడా ఎందుకు ఉండాలి? రెండవ కారణాన్నిబట్టి చూస్తే రాజ్యవ్యవస్థ అందరి తరఫున మాట్లాడుతుంది.

తమకు ఓటు వేయని వారి తరఫున కూడా మాట్లాడుతుంది కదా! అంటే బలవంతుల స్వరానికి, బలహీనుల స్వరానికీ తేడా ఉండకూడదు. చివరగా ప్రతిపక్ష పార్టీలు, సామాజిక ఉద్యమాలు నిర్వహించేవారు సామాన్యుల తరఫున మాట్లాడుతున్నాం అనేటట్టయితే ప్రతిపక్షాల స్వతంత్ర వాణికి అవకాశం ఉండకూడదు. కానీ భారత ప్రజాస్వామ్యంలో ఈ రకమైన స్వరాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇవి బహిరంగంగానూ వినిపించవచ్చు. మౌనంగానూ వినిపించవచ్చు. ప్రజాస్వామ్యంలో అందరి మాటకూ ఒకే రకమైన అవకాశం ఉంటుందని అనుకున్నా ప్రజాస్వామ్య జీవనంలో సామాన్యుల, అణగారిన వర్గాల స్వరం అన్న ప్రస్తావన ఉండనే ఉంటుంది. ఆదివాసుల, దళితుల, మైనారిటీల, శ్రామికుల స్వరం ఎప్పుడూ తక్కువ స్థాయిలోనే వినిపిస్తూ ఉంటుంది. ఈ వర్గాల వారే న్యాయం, సమానత్వం, గౌరవం కోసం మాట్లాడుతుంటారు. వివిధ ప్రభుత్వాల ఏలుబడిలో ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ స్వరాలను సాధారణంగా నిరాశాజనకమైనవిగా పరిగణిస్తారు. వీరు ఎప్పుడు పేద అరుపులు అరుస్తూనే ఉంటారు అంటారు.

ఈ స్వరాలు నిష్కారణమైనవి అని కూడా భావిస్తారు. కానీ నిరాశాజనకం అని భావిస్తున్న ఈ స్వరాలలో అంతర్గత కారణం ఉంటుంది. ఈ స్వరాలు మెజారిటీ వర్గం, ప్రభుత్వ స్వరానికి భిన్నమైనవి. అంటే ఇవి ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే వినిపిస్తూ ఉంటాయి. ప్రభుత్వం ఈ స్వరాలను ఆర్తితో కాకపోయినా వినిపించుకోవాలని భావిస్తాం. అయితే సామాన్యుల స్వరాలు ప్రజాస్వామ్యాన్ని ఈసడించవు, వ్యతిరేకించవు. తమ వ్యధను వెళ్లగక్కడానికే సామాన్యులు తమ స్వరం వినిపిస్తూ ఉంటారు. దుర్భరమైన తమ అస్తిత్వాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ పట్టించుకోవాలనే సామాన్యులు కోరుకుంటారు. హింసకు, లేమికి, కులం రీత్యా ఈసడింపునకు గురయ్యే వారు తమ విషయంలోనే ఆరోగ్యం, పట్టణ ప్రణాళికలు, మార్కె ట్లు ఎందుకు విఫలం కావాలని ప్రశ్నిస్తారు.మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు తమ గోడు పట్టించుకోవాలని సామాన్యులు కోరుకుంటారు.మానవత్వం అన్నభావనలో అందరికీ స్థానం ఉంటుందని సామాన్యుల స్వరం గురించి మాట్లాడే వారు భావిస్తారు.

అదే విధంగా సామాన్యుల స్వరాలు ఎంత కర్కషంగా ధ్వనించినప్పటికీ వీటికి హేతుబద్ధత ఉంటుంది. అంతర్గత సంస్కరణల విషయంలో రాజ్య వ్యవస్థ కూడా వీటికి కొంత విలువ ఇస్తుంది లేదా సమర్థిస్తుంది. లేదా రిజర్వేషన్ల విషయంలో లాగా మెజారిటీ స్వరాన్ని వినిపించుకున్న దానికన్నా రాజ్య వ్యవస్థ సామాన్యుల స్వరాన్నే ఎక్కువగా వినిపించుకుంటున్నట్టు కనిపించవచ్చు. కాలక్రమంలో బలహీనపడ్డ స్వరాలను బలమైన రాజ్య వ్యవస్థ నైతిక కారణంగానైనా పట్టించుకోవలసి వస్తుంది. ఒక్కొక్క సారి ప్రతిపక్షాలు కూడా సామాన్యుల స్వరాన్ని పట్టించుకోకపోవచ్చు. ఈ ప్రతిపక్ష పార్టీలు సామాన్యుల స్వరాల పట్ల సంఘీభావం తెలపకపోవచ్చు. ప్రతిపక్ష పార్టీలు సాధారణంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వం గురించి మాట్లాడతాయి కాని ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మాట్లాడకపోవచ్చు. సామాన్యుల స్వరాలు ప్రధాన స్వరాలుగా మారాలంటే ప్రత్యామ్నాయ రాజకీయాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడో ఒక సారి సామాన్యుల తరఫున మాట్లాడడం కాదు, ఊకదంపుడుగా మాట్లాడడం కాదు సమాజంలో ఎక్కువ మంది మద్దతును సామాన్యుల స్వరానికి అనుకూలంగా కూడగట్టగలగాలి.

ప్రత్యామ్నాయ రాజకీయాలు సమస్యల పరిష్కారానికి అనునిత్యం పోరాడుతున్న వర్గాల తక్షణ సమస్యలను పరిష్కరించడానికి ఉపకరించాలి. ఈ పని చేయాలంటే ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచించే వారు నిబద్ధతతో పని చేయాలి. సామాన్యుల పక్షాన నిలబడాలి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారే వారి పక్షం వహించకూడదు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు శాసనసభలో ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచించే వారికి ఏ రకంగానూ ఉపకరించవు. అప్పుడే సామాన్యుల స్వరం ఎన్నికలలో గణనీయమైన మార్పు తీసుకురాగలుగుతుంది. పర్యవసానం ఏమైనా కావచ్చు. ఈ రోజుల్లో ఎన్నికల ఫలితాలు సామాజిక, లింగ విభేదాలతో సంబంధం లేకుండా ‘ధనికుల‘కే అనుగుణంగా ఉంటున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలవల్ల ఫిరాయింపులవల్ల సామాన్యుల స్వరానికి ప్రభావం ఏమీ ఉండదు. ప్రత్యామ్నాయ రాజకీయాలు బలంగా ఉంటే ఉమ్మడిగా ప్రజాస్వామ్య స్వరం బలపడుతుంది.

Role of common people in democracy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రజాస్వామ్యంలో సామాన్యుల వాణి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: