ఎపిఐఐసి ఛైర్ పర్సన్ గా రోజా

అమరావతి : ఎపి సిఎం జగన్ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో నిరుత్సాహానికి గురైన నగరి వైసిపి ఎంఎల్ఎ రోజాపై రోజుకో వార్త వస్తోంది. నిన్నటికి నిన్న ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా నియమిస్తారన్న వార్తలు వచ్చాయి. ఆమెను ఎపిఐఐసి ఛైర్ పర్సన్ గా నియమించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారని బుధవారం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. సామాజిక వర్గాల సమీకరణల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని, ఈ క్రమంలో జగన్ […] The post ఎపిఐఐసి ఛైర్ పర్సన్ గా రోజా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి : ఎపి సిఎం జగన్ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో నిరుత్సాహానికి గురైన నగరి వైసిపి ఎంఎల్ఎ రోజాపై రోజుకో వార్త వస్తోంది. నిన్నటికి నిన్న ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా నియమిస్తారన్న వార్తలు వచ్చాయి. ఆమెను ఎపిఐఐసి ఛైర్ పర్సన్ గా నియమించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారని బుధవారం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. సామాజిక వర్గాల సమీకరణల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని, ఈ క్రమంలో జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని రోజా మంగళవారం మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కార్పొరేషన్ పదవుల్లో అతి కీలకమైన ఎపిఐఐసి ఛైర్ పర్సన్ పదవిలో రోజాను నియమించనున్నారన్న వార్తలు వస్తున్నాయి. కేబినెట్ హోదా కల్పిస్తూ ఎపిఐఐసి ఛైర్ పర్సన్ పదవిలో ఆమెను నియమించనున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఎపిఐఐసి ఛైర్ పర్సన్ పదవి గనుక రోజాకు వస్తే, ఆమెకు పెద్ద ఊరట లభించినట్లే.

Roja To Become APIIC Chairman

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎపిఐఐసి ఛైర్ పర్సన్ గా రోజా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: