రికార్డుల రారాజు

Rohit-sharma
హిట్‌మ్యాన్ ఖాతాలో,  మరో ప్రపంచ రికార్డు

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత స్టార్ ఆటగాడు, ఓపెనర్ రోహిత్ రోహిత్ శర్మ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడో సిక్సర్‌ను బాదడం ద్వారా ఓ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా కొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ హెట్‌మెయిర్ పేరిట ఉన్న 15 సిక్సర్ల రికార్డును రోహిత్ తిరగరాశాడు. 16 సిక్సర్లతో రోహిత్ కొత్త ప్రపంచ రికార్డును సాధించాడు. అంతేగాక ఓ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా కూడా రోహిత్ నిలిచాడు.

ఇదే సమయంలో హర్భజన్ పేరిట ఉన్న 14 సిక్సర్ల రికార్డును కూడా చెరిపేశాడు. మరోవైపు సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించడం ద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు. ఇంతకుముందు దిగ్గజ ఓపెనర్ సునీల్ గవాస్కర్ ఒక్కడే ఈ ఫీట్‌ను సాధించాడు. తాజాగా రోహిత్ మూడు సెంచరీలతో గవాస్కర్ సరసన నిలిచాడు. అయితే గవాస్కర్ ఈ ఫీట్‌ను మూడు సార్లు సాధించాడు. అంతేగాక గవాస్కర్ ఓ సిరీస్‌లో నాలుగేసి సెంచరీలను రెండు సార్లు నమోదు చేశాడు. కాగా, గవాస్కర్ తర్వాత ఓ సిరీస్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అంతేగాక టెస్టుల్లో రెండు వేల పరుగుల మైలురాయిని కూడా రోహిత్ చేరుకున్నాడు. దీంతోపాటు టెస్టుల్లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. 30 టెస్టుల్లో రోహిత్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

Rohit Sharma gets another world record

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రికార్డుల రారాజు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.