రాంచీ టెస్టులో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ

Rohit-sharma

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత స్టార్ ఆటగాడు, ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేశాడు. భోజన విరామానికి 199 పరుగులతో క్రీజులో ఉన్న హిట్ మ్యాన్, లంచ్ అనంతరం 200 పరుగుల మార్క్ ను క్రాస్ చేశాడు. 249 బంతులను ఆడిన రోహిత్ సిక్స్ తో 200 పరుగులు రాబట్టాడు. దీంతో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్. దక్షిణాఫ్రికాపై రెండోసారి 150కిపైగా పరుగులు చేసిన తొలి ఓపెనర్‌ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఈ ఫీట్ సాధించిన 8వ క్రికెటర్‌ గానూ నిలిచాడు. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ ఇప్పటికే మూడు సెంచరీలను సాధించిన విషయం తెలిసిందే. అయితే తన టెస్ట్ క్రికెట్ కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ సాధించిన రోహిత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ కంటే ముందు సచిన్, సెహ్వాగ్, గేల్ ఈ ఫీట్ ను సాధించారు.

rohit sharma double century in ranchi test series

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాంచీ టెస్టులో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.