అచ్చు చేపలాగే..

Fish

 

రోబో అనగానే మాట్లాడేవి, వంట చేసేవి, హోటల్స్‌లో సర్వ్ చేసేవి ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే ఈ మధ్యే శాస్త్ర వేత్తలు ఓ చేప రోబోని తయారు చేశారు. అయితే అది చేసే పనులు వింటే ఔనా! అని ఆశ్చర్యమేస్తుంది. దాని కథేంటో చూద్దాం మరి..
* శాస్త్రవేత్తలు ఏ పరిశోధనలు చేయాలన్నా శాస్త్రవేత్తలే డైవర్లుగా మారి వాటి దగ్గరకు వెళ్లాలి. అది వారికి పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. ప్రతిసారి అది వారికి కుదరని పని కూడా. అయితే ఈ కొత్త చేప రోబో ఈ పనులన్నింటినీ చాలా సులభంగా చేసేస్తుంది. బోలెడంత విలువైన సమాచారాన్ని అందిస్తోంది. వెళ్లడం వెళ్లడంతోనే సముద్ర జలాల్లోపల ఒక పెద్ద గ్రీన్‌లాండ్ సొర చేపను ఇది గుర్తించింది. ఆ సొర చేప 400 ఏళ్ల వయసున్నదని తెలుసుకుని శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయారు.
* ఇంతకీ ఈ రోబో పేరేంటో చెప్పలేదు కదూ… సోఫై. సిలికాన్ రబ్బరు, ప్లాస్టిక్‌లతో చేపంత పరిమాణంలో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్లు తయారుచేశారు దీన్ని.
* దీని పొడవు 47 సెంటీమీటర్లు. సెకెనులో దాదాపు ఇరవై మూడున్నర సెంటీమీటర్ల దూరం ఈదగలదు. అంటే దాని శరీర పరిమాణంలో సగం దూరాన్ని సెకెనులో ఈదగలుగుతుందన్న మాట. ఈ వేగం మామూలు చేప వేగం కన్నా కాస్త తక్కువేనట.
* శరీరాన్ని మెలికలు తిప్పుతూ, తోక ఊపుతూ అచ్చం చేపలాగే నీటిలో ప్రయాణించేస్తోంది.
* రిమోట్ కంట్రోల్ సహాయంతో దీన్ని నియంత్రించొచ్చు. డైవింగ్ వెళ్లినవారు దూరంలో ఉండి కూడా దీన్ని కావాల్సిన ప్రాంతాల్లోకి పంపించవచ్చు. దీని వేగం, దిశల్ని మార్చవచ్చు.

The post అచ్చు చేపలాగే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.