కళ్లలో స్ప్రేకొట్టి భారీ చోరీ

DCP

 

దుండగులను త్వరలో పట్టుకుంటాం : డిసిపి

మన తెలంగాణ/సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో భారీ చోరి జరిగింది. మహంకాళి ఆలయ సమీపంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి నగదుతో ఉడాయించారు. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. పక్కా ప్రణాళికతో అగంతకులు ఓ వ్యక్తిపై పెప్పర్ స్ప్రే చేసి రూ. 30లక్షల నగదుతో ఉడాయించారు. మహంకాళి పొలీస్‌స్టేషన్ పరిధిలోని మహంకాళి ఆలయ సమీపంలో నవకార్, రోహిత్ నగల దుకాణాలు ఉన్నాయి. శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తి రోహిత్ జూవెల్లర్స్ పేరుతో అర్డర్‌లపై నగలు తయారు చేసి ఆయా దుకాణాలకు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో తాను తయారు చేసిన నగలను అదే ప్రాంతంలో ఉన్న నవకార్ నగల దుకాణం కొనుగోలు చేస్తుంటుంది.

వారి మధ్య ఉన్న లావాదేవిల్లో భాగంగా నవకార్ నగల దుకాణం వద్ద నుండి 30లక్షల రూపాయాలు తీసుకురావాల్సిందిగా శ్రీనివాస్ వర్మ తన వద్ద పనిచేసే రూపారామ్ అనే వ్యక్తిని నవకార్ నగల షాపుకు పంపించాడు. రూపారాం 30 లక్షల నగదును తీసుకొని నవకార్ నగల దుకాణం మొదటి అంతస్తు నుండి సెల్లార్ వైపు వెలుతుండగా అప్పటికే అక్కడ కాపుకాచిన ఓ అగంతకుడు రూపారామ్ కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి అతని చేతిలో ఉన్న 30 లక్షల రూపాయల నగదు బ్యాగును లాక్కొని ఆ పక్కనే దిచక్ర వాహనంపై వేచి ఉన్న వ్యక్తితో ఉడాయించాడు. దీంతో బాధితుడు మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సిఐ కావేటి శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసు బృందాలు సంఘటనా స్థలిని పరిశీలించాలరు. చోరీ జరిగిన తీరును క్షుణంగా పరిశీలించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

సిసి ఫుటేజీలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చోరి చేసి పారిపోవడం అసాధ్యమని నిందితులు పక్కా ప్రణాళికతో ముందుగానే రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహకాంళి ఆలయ సమీపంలో జరిగిన చోరీ తీరును డిసిపి కలమేశ్వర్ పరిశీలించారు. పక్కా ప్రణాళికతోనే ఈ చోరి జరిగిందని నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. దుండగులు వాడిని ద్విచక్ర వాహనాన్ని గుర్తించడం జరగిందని హయత్‌నగర్‌లో గత 15 రోజుల క్రితం చోరీ అయినట్టుగా తెలుస్తున్నదని సిసి ఫుటేజీలను క్షుణంగా పరిశీలిస్తున్నామని నగదు దొంగలించిన అగంతకులు కలాసీగూడ మీదుగా మంజూ థియేటర్ వైపు వెళ్లినట్టు గుర్తించామన్నారు. కాగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.

Robbery Near Secunderabad Mahankali Police Station

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కళ్లలో స్ప్రేకొట్టి భారీ చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.