గుంతలు తవ్వారు.. పూడ్చడం మరిచారు…

ప్రమాదం జరిగితే స్పందిస్తారా… నందిగామః రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు అందివ్వడానికి ప్రవేశపెట్టిన పథకం మిషన్ భగీరథ. ఈ పథకం కింద పైపు లైన్లు వేయడానికి గుంతలు తీస్తున్నారు పూడ్చడం మరుస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైను కోసం నందిగామ మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై రోడ్డును అడ్డంగా తవ్వి సరిగ్గా పూడ్చకపోవడంతో ఆ రోడ్డు గుంతగా మారి వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కొత్త వారు రోడ్డు గుండా వెళ్ళెటప్పుడు గుంత రాగానే […] The post గుంతలు తవ్వారు.. పూడ్చడం మరిచారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ప్రమాదం జరిగితే స్పందిస్తారా…

నందిగామః రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు అందివ్వడానికి ప్రవేశపెట్టిన పథకం మిషన్ భగీరథ. ఈ పథకం కింద పైపు లైన్లు వేయడానికి గుంతలు తీస్తున్నారు పూడ్చడం మరుస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైను కోసం నందిగామ మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై రోడ్డును అడ్డంగా తవ్వి సరిగ్గా పూడ్చకపోవడంతో ఆ రోడ్డు గుంతగా మారి వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.

కొత్త వారు రోడ్డు గుండా వెళ్ళెటప్పుడు గుంత రాగానే సడన్ బ్రేక్ వేయడంతో వెనుకాల నుండి వచ్చే వాహనాలు అదుపుచేయలేక ముందు వెళ్ళె వాహనాలను ఢీకొట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈవిధంగా రెండు నెలల కిందట షాద్‌నగర్ పరిధిలోని లింగారెడ్డిగూడ హైవేపై నందిగామ మండలం వెంకమ్మగూడ గ్రామానికి చెందిన యువకుడు మరణించాడు. అధికారులు ఇటువంటి ప్రమాదం జరిగితేగాని కళ్ళు తెరవరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని మామిడిపల్లి రోడ్డుకు వెళ్ళె దారిలో పైపు లైన్ల కోసం తవ్వారు గుంతను సరిగ్గా పూడ్చడం మరవడంతో సింబాయాసిస్ యూనివర్సిటీ విద్యార్థులు, ఆయా గ్రామస్తులు, పరిశ్రమల కార్మికులు రోజు అదే దారిన తరుచూ వెళుతుంటారు.

ఆ రోడ్డు పెద్ద గుంతగా మారి ఆ గుంతలో వాహనాలు దిగబడటంతో వాహనాలను అందులో నుండి తీయడానికి గంటల సమయం పడుతుంది. దీనితో ఆ రోడ్డుపై నుండి వెళ్ళె వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతన్నారు. అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో మండల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంభందిత అధికారులు స్పందించి వెంటనే గుంతగా మారిన రోడ్లను బాగుచేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

Roads Damaged in Mission Bhagiratha works

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గుంతలు తవ్వారు.. పూడ్చడం మరిచారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: