లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం…

Road accident in mahabubnagar district

కోస్గి: ప్రమాదవశాత్తు లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన  సంఘటన మండల కేంద్రంలో సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకొంది. ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం… మహరాష్ట్రలోని షోలాపూర్ పట్టణానికి చెందిన శ్రీశైల్ శ్యామ్‌లింగ్ హెల్కర్(36) ద్విచక్ర వాహనాలపై తన స్నేహితులతో కలిసి శ్రీశైలం దేవస్థానానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఆదివారం రాత్రి కోస్గిలోని శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ కు చేరుకున్నారు. రాత్రి అక్కడే స్నేహితులతో కలిసి నిద్రించారు. మరుసటిరోజు ఉదయం 2.30 గంటలకు షోలాపూర్‌కు బయలుదేరే క్రమంలో ఎపి 23వై 7689 నంబరు గల డిజిల్ లారీ ప్రమదవశాత్తు బైక్ ను ఢీకొట్టింది. దీంతో శ్రీశైల్ శ్యామ్‌లింగ్ హెల్కర్(36) తలకు గాయాలు అయ్యి అతని ముక్కు,చెవుల నుండి అధిక రక్త స్రావం అయింది.చికిత్స నిమిత్తం కొడంగల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుని స్నేహితుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు.

Comments

comments