కారు ,ట్రాక్టర్ ఢీ…

కొడిమ్యాల : జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి పూడూరు సమీపంలోని అరపెల్లి మూల మలుపు వద్ద మంగళవారం  కారు, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ నుండి జగిత్యాలకు వస్తున్న టిఎస్ 22 1231 నెంబరు గల కారు, కొండగట్టు దైవ దర్శనం చేసుకొని తిరిగి బొమ్మకల్ వెళ్తున్న ట్రాక్టర్ అరవెల్లి స్టేజీ మూల మలుపు వద్ద అతివేగంగా ఎదురెదురుగా ఢీకొనడంతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కారులో ఉన్న […]


కొడిమ్యాల : జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి పూడూరు సమీపంలోని అరపెల్లి మూల మలుపు వద్ద మంగళవారం  కారు, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ నుండి జగిత్యాలకు వస్తున్న టిఎస్ 22 1231 నెంబరు గల కారు, కొండగట్టు దైవ దర్శనం చేసుకొని తిరిగి బొమ్మకల్ వెళ్తున్న ట్రాక్టర్ అరవెల్లి స్టేజీ మూల మలుపు వద్ద అతివేగంగా ఎదురెదురుగా ఢీకొనడంతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కారులో ఉన్న ఎల్లంకి లింగమూర్తి (సుల్తానాబాద్)కు చెయి విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంఘటన స్థలాన్ని కొడిమ్యాల ఎఎస్‌ఐ ముకీదొద్దిన్ పరిశీలించి కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

Comments

comments

Related Stories: