ప్రైవేట్‌ చేతుల్లోకి 50 స్టేషన్లు, 150 రైళ్లు ఇక ప్రైవేటుపరం!

న్యూఢిల్లీ: దేశంలోని రైల్వే స్టేషన్లను, రైళ్లను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల దేశంలోని తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడంతో ఈ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక దేశంలోని 50 రైల్వే స్టేషన్లు, 150 రైళ్లను ప్రైవేటుపరం చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్‌కు […] The post ప్రైవేట్‌ చేతుల్లోకి 50 స్టేషన్లు, 150 రైళ్లు ఇక ప్రైవేటుపరం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: దేశంలోని రైల్వే స్టేషన్లను, రైళ్లను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల దేశంలోని తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడంతో ఈ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక దేశంలోని 50 రైల్వే స్టేషన్లు, 150 రైళ్లను ప్రైవేటుపరం చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్‌కు రాసిన ఒక లేఖలో తెలియచేశారు.

కొన్ని పాసింజర్ రైళ్లను ప్రైవేటు ట్రెయిన్ ఆపరేటర్లకు అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించిన విషయం మీకు తెలుసునని, తొలి దశలో 150 రైళ్లను ప్రైవేటుపరం చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని అమితాబ్ కాంత్ తన లేఖలో పేర్కొన్నారు. ఇక 50 రైల్వే స్టేషన్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయానికి సంబంధించి రైల్వే మంత్రి పియూష్ గోయల్‌తో తాను సుదీర్ఘంగా చర్చించానని, ఈ విషయానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని కూడా తాను కోరానని నీతి ఆయోగ్ సిఇఓ తన లేఖలో పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేసేందుకు రైల్వే బోర్డుకు చెందిన ఇంజనీరింగ్ సభ్యుడు, ట్రాఫిక్ సభ్యుడితో ఒక గ్రూపు ఏర్పాటు చేయాలని తాను సూచించినట్లు ఆయన చెప్పారు.  ఇలా ఉండగా, ఆర్థికంగా, నిర్వహణాపరంగా వెసులుబాటు ఉన్న కొన్ని రైల్వే రూట్లను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ప్రైవేటుపరం కానున్న 24 రూట్లను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు వర్గాలు చెప్పాయి. ఈ రూట్లలో దూర ప్రయాణం, రాత్రి ప్రయాణం, ఇంటర్-సిటీ రైళ్లు, సబర్బన్ రైళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి పూట, దూర ప్రయాణం సాగించే రూట్లలో ఈ రైళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-లక్నో, ఢిల్లీ-జమ్మూ/కాట్రా, ఢిల్లీ-హౌరా, సికింద్రాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-చెన్నై, ఢిల్లీ-చెన్నై, ముంబై-చెన్నై, హౌరా-చెన్నై, హౌరా-ముంబై.

ఇంటర్ సిటీ రైళ్లు: ముంబై-అహ్మదాబాద్, ముంబై-పుణె, ముంబై-ఔరంగాబాద్, ముంబై-మడ్గావ్, ఢిల్లీ-చండీగఢ్/అమృత్‌సర్, ఢిల్లీ-జైపూర్/అజ్మీర్, హౌరా-పూరి, హౌరా-టాటా, హౌరా-పాట్నా, సికింద్రాబాద్-విజయవాడ, చెన్నై-బెంగళూరు, చెన్నై-కోయంబత్తూరు, చెన్నై-మదురై, ఎర్నాకుళం-త్రివేండ్రం.

సబర్బన్ రైళ్లు: ముంబై, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్.
ఈ ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో అమలు చేసేందుకు నీతి ఆయోగ్ సిఇఓ, రైల్వే బోర్డు చైర్మన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శిలతో కూడిన కార్యదర్శుల గ్రూపును ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖలో నీతి ఆయోగ్ సిఇఓ కోరారు.

Rly is planning to privatise over 50 stations and 150 trains, the government of India stepped up efforts to privatise railway stations and trains in the country

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రైవేట్‌ చేతుల్లోకి 50 స్టేషన్లు, 150 రైళ్లు ఇక ప్రైవేటుపరం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: