ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌కు చోటు దక్కేనా?

లండన్: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో ప్రపంచకప్ మిగతా మ్యాచుల్లో ఆడడం ప్రశ్నార్థకంగా మారింది. ధావన్ ఎడమ చేతి బొటన వేలుకు గాయం తీవ్రంగా ఉండడంతో కనీసం మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. ఐసిసి టోర్నీల్లో, ముఖ్యంగా ఇంగ్లండ్‌లో కళ్లు చెదిరే రికార్డున్న ధావన్‌ ఈ మెగా టోర్నీకి దూరమైతే […] The post ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌కు చోటు దక్కేనా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో ప్రపంచకప్ మిగతా మ్యాచుల్లో ఆడడం ప్రశ్నార్థకంగా మారింది. ధావన్ ఎడమ చేతి బొటన వేలుకు గాయం తీవ్రంగా ఉండడంతో కనీసం మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. ఐసిసి టోర్నీల్లో, ముఖ్యంగా ఇంగ్లండ్‌లో కళ్లు చెదిరే రికార్డున్న ధావన్‌ ఈ మెగా టోర్నీకి దూరమైతే ఆ లోటును పూడ్చడం చాలా కష్టమని చెప్పాలి.

కాగా, ధావన్ స్థానాన్ని యువ ఆటగాడు రిషబ్ పంత్‌తో భర్తీ చేయడానికి బిసిసిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  అధికారికంగా దీనిపై ఇంకా ప్రకటన వెలువడకపోయినా ధావన్‌కు బదులు పంత్ జట్టులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అంబటి రాయుడితో పోల్చితే రిషబ్ పంత్‌వైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. గవాస్కర్, గంగూలీ, మంజ్రేకర్ వంటి మాజీ క్రికెటర్లు రిషబ్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే గంభీర్ మాత్రం రాయుడిని ఎంపిక చేయడమే ఉత్తతమమని అభిప్రాయపడ్డాడు.పరిస్థితులు మాత్రం రిషబ్‌కే అనుకూలంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే పంత్ ఇంగ్లండ్‌కు చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Rishabh pant to replace injury shikhar dhawan?

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌కు చోటు దక్కేనా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: