పంతూ…బ్యాటింగ్‌లో నీకంటే బుమ్రా, షైనీలే నయం

బెంగళూరు: భారత జట్టులో ఎన్నో అవకాశాలు ఇచ్చిన కూడా రిషభ్ పంత్ ఉపయోగించుకోవడంలేదు. ధోనీ స్థానంలో వచ్చిన పంత్  సరిగా బ్యాటింగ్ చేయడం లేదు. దీంతో పంత్‌పై మాజీ విమర్శలు గుప్పిస్తున్నారు. పంత్‌కు బదులుగా శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి యువ ఆటగాళ్లకు చాన్స్ ఇస్తే బాగుంటుందని బిసిసిఐకి క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు. పంత్ తన బ్యాటింగ్‌లో తప్పిదాలను సరిచేసుకోకపోతే స్థానం గల్లంతయ్యే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టి-20లో పంత్ 19 పరుగులు చేసి నిరాశపరిచాడు. గత పది టి-20ల్లో 18.62 సగటుతో 149 పరుగులు చేసి విఫల బ్యాట్స్ మెన్ పేరు గాంచాడు. పంతూ.. టిమిండియాను వదిలి చిన్న పిల్లలతో ఆడుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బుమ్రా, షైనీలే పంత్ కంటే బాగా బ్యాటింగ్ చేస్తున్నారని నెటిజన్లు చురకలంటించారు.

 

Rishabh Pant Failure in Batting in Twenty Twenty

The post పంతూ… బ్యాటింగ్‌లో నీకంటే బుమ్రా, షైనీలే నయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.