రూ.1.15 లక్షల కోట్ల విలువ వాటాలు విక్రయం

  ఏడాదిన్నరలో రుణ రహిత సంస్థగా రిలయన్స్ నెలకు రూ.700లకే జియో ఫైబర్ కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్‌ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన ప్రకటనలు చేశారు. ఒకటి 18 నెలల్లో రిలయన్స్‌ను రుణ రహిత సంస్థగా మార్చడం, మరొకటి అత్యంత తక్కువ ధరకే జియో ఫైబర్ సేవలు అందించడం. సోమవారం కంపెనీ 42వ వార్షిక సాధారణ సమావేశం(ఎజిఎం)లో ఈ కీలక ప్రకటనలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్, […] The post రూ.1.15 లక్షల కోట్ల విలువ వాటాలు విక్రయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఏడాదిన్నరలో రుణ రహిత సంస్థగా రిలయన్స్

నెలకు రూ.700లకే జియో ఫైబర్
కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్‌ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ

బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన ప్రకటనలు చేశారు. ఒకటి 18 నెలల్లో రిలయన్స్‌ను రుణ రహిత సంస్థగా మార్చడం, మరొకటి అత్యంత తక్కువ ధరకే జియో ఫైబర్ సేవలు అందించడం. సోమవారం కంపెనీ 42వ వార్షిక సాధారణ సమావేశం(ఎజిఎం)లో ఈ కీలక ప్రకటనలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్, కెమికల్ వ్యాపారంలో 20 శాతం వాటాలను సౌదీ ఆయిల్ దిగ్గజం ‘ఆరామ్కో’కు, అలాగే ఇంధన రిటైల్ నెట్‌వర్క్‌లో 49 శాతం వాటాలను బ్రిటన్‌కు చెందిన బిపి పిఎల్‌సికి విక్రయించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందాల విలువ రూ.1.15 లక్షల కోట్లు ఉంటుంది. దీని ద్వారా 18 నెలల్లో రుణ రహిత సంస్థగా మారాలని లక్షంగా చేసుకున్నట్టు ముఖేష్ అంబానీ తెలిపారు. అదే సమయంలో సెప్టెంబర్ 5 నుంచి నెలకు కేవలం రూ.700లకే ఫైబర్ ఆధారిత ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనున్నట్టు ప్రకటించారు. 100 ఎంబిపిఎస్ వేగం, జీవితకాలం ఉచిత వాయిస్ కాల్స్, టెలివిజన్, హెచ్‌డి సెట్‌తో వీడియో స్ట్రీమింగ్‌ను కనెక్షన్‌తోపాటు ఉచితంగా ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.

న్యూఢిల్లీ : రిలయన్స్ ఆయిల్, కెమికల్స్ వ్యాపారం లో 20% వాటాలను సౌదీ ఆరామ్కో సంస్థకు విక్రయించనుండగా, దీని విలువ 75 బిలియన్ డా లర్లు ఉంటుంది. మరోవైపు బ్రిటన్ సంస్థ బిపి.. రిలయన్స్ పెట్రోల్ పంపులు, వైమానిక ఇంధన విభాగాల్లో 49 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది.

చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి
రిలయన్స్ చరిత్రలోనే సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ అతిపెద్ద విదేశీ పెట్టుబడి అని, అంతేకాదు దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ పెట్టుబడి అని ముఖేష్ అన్నారు. ఇంతకుముందు 2011 సంవత్సరంలో రిలయన్స్‌లో 21 చమురు, గ్యాస్ బ్లాక్‌ల్లో దాదాపు 30 శాతం వాటాలను బిపి కొనుగోలు చేయగా, దీని విలువ 7.2 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఆరామ్కోతో ఒప్పందం రిలయన్స్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ ఆస్తులు మొత్తం కవర్ చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి సంస్థ ఆరామ్కో డీల్‌లో భాగంగా రోజుకు 5 లక్షల బ్యారెల్స్ చమురును గుజరాత్‌లోని జామ్‌నగర్ వద్ద రిలయన్స్‌కు చెందిన జంట రిఫైనరీలకు సరఫరా చేస్తుంది. రిలయన్స్ ఇంధన రిటైలింగ్ నెట్‌వర్క్‌లో 49 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు బిపి రూ.7 వేల కోట్లు చెల్లించనుందని ముఖేష్ తెలిపారు. గతవారం ఈ రెండు సంస్థలు భారత్‌లో రిటైల్ ఏవియేషన్ టర్బైన్ ఇంధనం, పెట్రోలు పంపులు ఏర్పాటు చేసేందుకు కొత్త జాయింట్ వెంచర్‌ను ప్రకటించాయి. రిలయన్స్‌కు ఇప్పటికే 1400 పెట్రోల్ పంపులు, 31 విమాన ఇంధన కేంద్రాలు ఉన్నాయి.

రుణం తగ్గుతుంది..
ఈ ఒప్పందాలతో కంపెనీ రూ .1.15 లక్షల కోట్లు సంపాదిస్తుంది. దీంతో రుణాన్ని తగ్గించుకోనున్నట్టు ముఖేష్ తెలిపారు. రాబోయే 18 నెలల్లో రుణ రహిత సంస్థగా మారాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఒప్పందాలకు రెగ్యులేటరీ అనుమతి పొందవలసి ఉంది. రిలయన్స్ పెట్రోల్ రిటైల్ వ్యాపారంలో (పెట్రోల్ పంప్ ఆపరేషన్స్) 49 శాతం వాటాలను బ్రిటన్‌కు చెందిన ప్రధాన పెట్రోలియం కంపెనీ బిపికి విక్రయించనున్నట్లు అంబానీ తెలిపారు. దీంతో 7,000 కోట్ల రూపాయలు పొందనున్నట్టు వెల్లడించారు. ఈ వ్యాపారంలో కంపెనీకి 51 శాతం వాటా ఉంటుంది. సౌదీ అరామ్‌కో 20 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందాల నుండి రిలయన్స్‌కు మొత్తం రూ 1.15 లక్షల కోట్లు రానున్నాయి. దీంతో రాబోయే 18 నెలల్లో రుణ రహిత సంస్థగా మారేందుకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ఈ రెండు ఒప్పందాలతో 2019 జూన్ 30 నాటికి కంపెనీ రూ.2,88,243 కోట్ల రుణాన్ని తగ్గించటానికి దోహదపడనున్నాయి. అరామ్‌కోతో ఒప్పందం 2020 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ తెలిపింది.

అతిపెద్ద పన్ను చెల్లింపు సంస్థ..
గత ఆర్థిక సంవత్సరంలో జిఎస్‌టి రూ.67,320 కోట్లు, ఆదాయపు పన్ను రూ.12,191 కోట్లు మేరకు రిలయన్స్ చెల్లించిందని అంబానీ తెలిపారు. దేశంలో అతిపెద్ద పన్ను చెల్లింపు సంస్థగా రిలయన్స్ ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి మేరకు జమ్మూ కాశ్మీర్, లడఖ్ అభివృద్ధికి, అక్కడి ప్రజల అవసరాలకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో అభివృద్ధి కార్యకలాపాల కోసం రిలయన్స్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు.

5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధిస్తాం
2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిని సాధించవచ్చని ముఖేష్ అన్నారు. కొన్ని రంగాలలో మందగమనం తాత్కాలికమే అని అన్నారు. ‘చమురు, రసాయన వ్యాపారం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అవకాశం ఉందన్నారు. 2030 నాటికి భారతదేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని ఆశిస్తున్నామని ముఖేష్ అన్నారు.

RIL aims to become as debt free company in 18 months

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూ.1.15 లక్షల కోట్ల విలువ వాటాలు విక్రయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: