కాళేశ్వరం పనులపై మంత్రి ఫోకస్…

  వరుసగా పనులపై సమీక్షలు ఇప్పటికే పంప్‌హౌజ్ పనుల పరిశీలన సోమవారం పైప్‌లైన్ పనులపై సమీక్ష పనుల వేగం పెరగాలని అధికారులకు ఆదేశం మంత్రితో కలిసి సమీక్షలో పాల్గొన్న బాజిరెడ్డి నిజామాబాద్ ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు నిజామాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్ జిల్లాతో పాటు శ్రీరాంసాగర్ ఆయకట్టుకు సాగునీరందించే పనులపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టును ఇటీవలే […] The post కాళేశ్వరం పనులపై మంత్రి ఫోకస్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరుసగా పనులపై సమీక్షలు
ఇప్పటికే పంప్‌హౌజ్ పనుల పరిశీలన
సోమవారం పైప్‌లైన్ పనులపై సమీక్ష
పనుల వేగం పెరగాలని అధికారులకు ఆదేశం
మంత్రితో కలిసి సమీక్షలో పాల్గొన్న బాజిరెడ్డి
నిజామాబాద్ ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు

నిజామాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్ జిల్లాతో పాటు శ్రీరాంసాగర్ ఆయకట్టుకు సాగునీరందించే పనులపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టును ఇటీవలే జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కు ఇప్పటికే నీరు చేరుతుండగా ఈయేడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీటి మళ్లింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జగిత్యాల్ జిల్లాలో ని రాంపూర్ వద్ద పంప్‌హౌజ్‌ను ఇటీవలే మంత్రి వేముల ట్రయల్న్ నిర్వహించ గా జిల్లాలో సాగుతున్న 20,21 ప్యాకేజీ పనులపై వరుస సమీక్షలతో దూకుడూ పెంచారు.

నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సా రంగాపూర్, మెంట్రాజ్‌పల్లి వద్ద నిర్మిస్తు న్న పంప్‌హౌజ్‌లను ఎ మ్మె ల్యే బాజిరెడ్డితో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై అధికారులను ఆరాతీసారు. ప్ర స్తుతం జరుగుతు న్న ప నుల వేగం ల క్ష్యాన్ని చేరుకోలేదని స్పష్టం చేసిన ఆ యన ప్రతి 15రోజుల కో కసారి సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పను ల వేగం పెరిగేందుకు తీసుకోవల్సిన చర్యలపై సా గునీటి పారుదల శాఖతో చర్చించి న ఆయన సోమవారం హైదరాబాద్‌లో తన చాంబర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగానే అధికారులకిచ్చిన సమాచారం మేరకు పూర్తి నివేదికల ను మంత్రి తెప్పించుకున్నారు.

ఇప్పటికే మె ట్‌పల్లి లైన్ 80 కిలోమీటర్లకు గాను 50 కిలో మీటర్లు పూర్తికాగా మిగిలిన 30 కి లోమీటర్ల పనులను వెంటనే పూర్తి చే యాలని అధికారులకు ఆదేశించారు. అదే సమయంలో సమాంతరంగా గడ్కోల్ పైప్‌లైన్ పనులు కూడా వేగంగా కొనసాగించాలని, ఏవైనా అడ్డంకులు వస్తే తమ తెలియజేయాలని స్పష్టం చేశారు. అ యితే అభ్యంతరాలు, అవాంతరాల పేరుతో పనుల్లో జాప్యం చేస్తే సహించేది లే దని స్పష్టం చేశారు. రామడ్గు, నిజాంసాగర్ ఆ యకట్టు కింద ఉన్న సాగునీరు రా ని టెయిల్ ఎండ్ ప్రాంతాలను కూడా 21 ప్యా కేజీలో చేర్చాలని ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనలకు మంత్రి సానుకూలంగా స్పం దించారు.

ఈ మేరకు 21 ప్యాకేజి లో చేర్చేందుకు అధికారులను ఆదేశించారు. మ రోవైపు పనులకు స్థానిక రైతులు సహకరిస్తూ అధికారులకు, ఏజెన్సీకి తోడ్పాటునందించాలని మంత్రి కోరారు. భూమిలో వేసే పైప్‌లైన్ 1.5 మీటర్ల లోతునుం డి వెల్లడం వల్ల మట్టి కప్పేసిన త ర్వాత పంట వేసుకోవచ్చని రైతులకు సూచించా రు. పైప్‌లైన్ పనులు ప్రారంభానికి ముందే పంలు వేసి ఉంటే ఇబ్బంది పడవద్దని కో రారు. గ్రామాభివృద్ధ్ది కమిటీలు సాగునీటి ప్రాముఖ్యతను గుర్తించి సహకరించాల ని కోరారు. ఈ మేరకు ప్రతి 15రోజులకోకసారి 20,21 ప్యాకేజీ పనులపై పూర్తి నివేదికలు తెప్పించుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆకస్మీక తనిఖీలు చే యాల ని మంత్రి భావిస్తున్న ట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గో వర్ధన్ సైతం తన ని యోజకవర్గంలో జరుగుతున్న కాళేశ్వరం పనులపై ప్ర త్యేక శ్ర ద్ధ్ద కనబరుస్తున్నా రు. ఈ యేడాది కాళేశ్వరం నీరు సాదిస్తే నియోజకవర్గం లో తి రుగు ఉండదని ఆయన భావిస్తున్నారు. అందుకు నిత్యం కాళేశ్వరం ఏజెన్సీలతో ఎమ్మెల్యే టచ్‌లో ఉంటూ మంత్రితో కలిసి పనుల వేగాన్ని పెంచేందుకు పా వులు కదుపుతున్నారు. మొత్తానికి కాళేశ్వరం పనుల వేగం పెరగడంతో రైతుల్లోను ఆ నందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి.

Review of Kaleshwaram Works

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాళేశ్వరం పనులపై మంత్రి ఫోకస్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: