ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

palamuru rangareddy project

 

సిఎం కెసిఆర్ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలి
కోయిలసాగర్ పనులు కూడా పూర్తి కావాలి
రాజధానిలో కీలక సమీక్ష సమావే శంలో పాల్గొన్న మంత్రులు,ఎంపిలు, ఎమ్మెల్యేలు

పాలమూరు రంగారెడ్డి ప్రాజక్టును శక్తివంచన లేకుండా మూడు షిప్టులలో పనులను చేపట్టి పూర్తి చేయాలి

మహబూబ్‌నగర్ : పాలమూరు… రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధుల ఉన్నత స్థాయి సమీక్షాసమావేశం. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర అబ్కారి , క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిలతో పాటు పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాములు , శాసన సభ్యులు లకా్ష్మరెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జ నార్ధన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జైపాల్ యా దవ్ , ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీ రం హర్షవర్ధన్‌రెడ్డి, అబ్రహంలతో పాటు ఇరిగేషన్ అధికారులు సీఈ లు ఖగేందర్ , రమేష్, ఎస్‌ఈలు నర్సింగ్‌రావు, అంజయ్యలఓత పా టు ఈఈలు , డీఈలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇటీవల పాలమూరు … రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై క్షేత్ర స్థాయి పర్యాటన చేసిన అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచించిన పలు అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో మం త్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఇరిగేషన్ అధికారుల తో చర్చించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ధేశించిన గడువు లోపల పాలమూరు … రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని అధికారులను ఈ సమీక్షా సమావేశంలో కోరారు. అంతేగాకుండా ఈ ఉన్నత స్థాయిసమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌ను పాలమూరు … రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును హన్వాడ ద్వారానే నిం పాలని అదికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి శ్రీనివాస్‌గహౌడ్ మాట్లాడుతూ ము ఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేశారు.

ఇదే వేగంతో పాలమూరు .. రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పాలమూరు .. రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికి శక్తివంచన లేకుండా ఇరిగేషన్ అధికారులు మూడు షిప్టులలో పనులను చేపట్టి పూర్తి చేయాలని కోరారు. గత పాలకుల తప్పిదాలను సరి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను కోరారు. ముఖ్యమంత్రికి కేసీఆర్ సూచనల మేరకు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. శాసన సభ్యులు సూచించిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు. గత ఎండాకాలంలో నీటి ఎద్దడి కారణంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆఱ్ విజ్ఞప్తి మేరకు కర్ణాటక ప్రభుత్వం జూరాలకు నీటిని విడుదల చేయించుకోవాల్సి వచ్చిందన్నారు.

భవిష్యత్‌లో ఆ పరిస్థితి రాకుండా కర్వెన రిజర్వాయర్ నుండి సంగంబండ రిజర్వాయర్ నుండి జూరాల రిజర్వాయర్‌కు నీటిని నింపుకునేలా ప్రతిపాదనలు తయారు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు … రంగారెడ్డి , కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో నీరందని బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి, గంగారం, శాయిన్‌పల్లి, మమ్మాయపల్లి గ్రామాలకు సాగునీరు అందించేందుకు వెంటనే మార్కండేయ లిప్టు, ఘనపురం మండలం జంగమాయపల్లి, పామిరెడ్డిపల్లి, రుక్కన్నపల్లి, 15 తండాలకు సాగునీరు అందించేందుకు కర్నెతాండ లిప్టు ప్రతిపాదనలు సిద్దం చేయాలని కోరారు. బుద్దారం ఎడమ కాలువతో తాడిపర్తి చెరువు నింపి అక్కడి నుండి నర్సింగాయపల్లి, అచ్చుతాపరం, రాజనగరం ప్రాంతాలకు సాగునీరు అందించాలని నిర్ణ?ఇంచారు.

కేఎల్‌ఐ రిజర్వాయర్ కింద ఆన్‌లైన్ రిజర్వాయర్లు వెంటనే చేపట్టాలని కోరారు. మంత్రి కల్వకుర్తి ఎత్తిపోతల కాలువ సామర్థం కేవలం లక్షా 80వేలకు మాత్రమే డిజైన్ చేశారు. దాని కింద 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ఉన్న కాలువతో అన్ని ఎకరాలకు నీరందించడం సాధ్యం కాన్నందున ఏదుల రిజర్వాయర్ నుండి బుద్దారం అటు నుండి ఘ పురంకు లింకు ఇవ్వాలని మంత్రి నిరంజన్‌రెడ్డి నిర్ణ?ఇంచారు.

వనపర్తి జిల్లాలోని 83 కింద ఎంజే3, ఎంజే4 కాలువలు వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులను కోరారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డిలు ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నిర్ధేశించిన విధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని కోరారు.

Review meeting on construction work of project

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.