రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌ను చావగొట్టారు..!(షాకింగ్ వీడియో)

Retired Cop thrashed to death in Allahabad లక్నో: యుపిలోని అలహాబాద్ లో దారుణం జరిగింది. ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌ను ముగ్గురు వ్యక్తులు చావగొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సిసిటివి కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉదయం రిటైర్డ్ ఎస్‌ఐ అబ్దుల్ సమద్ ఖాన్(70) సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆయనను కిందపడేసి కర్రతో విచక్షణ రహితంగా […]

Retired Cop thrashed to death in Allahabad

లక్నో: యుపిలోని అలహాబాద్ లో దారుణం జరిగింది. ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌ను ముగ్గురు వ్యక్తులు చావగొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సిసిటివి కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉదయం రిటైర్డ్ ఎస్‌ఐ అబ్దుల్ సమద్ ఖాన్(70) సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆయనను కిందపడేసి కర్రతో విచక్షణ రహితంగా కొట్టడం ప్రారంభించాడు. సమద్ ఖాన్ అతడిని అడ్డుకునే క్రమంలో కింద పడిపోయాడు. అనంతరం మరో ఇద్దరు వచ్చి బాధితుడిపై కర్రలు, రాడ్లతో దాడి చేయడంతో స్పృహాకోల్పోయాడు. దీంతో చనిపోయాడని నిందితులు ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో కొనఊపిరితో ఉన్న సమద్ ఖాన్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. కాగా, తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పోలీసుల విచారణలో ఆస్తి తగాదాల నేపథ్యంలో ఖాన్‌పై అతడి బంధువలే దాడి చేసినట్లు తేలింది. సిసిటివి కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు మొదట ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని జునైద్‌గా గుర్తించారు.

Related Stories: