ఉక్రెయిన్, స్పెయిన్ రసవత్తర రాజకీయాలు

  ఇటీవల యూరోప్‌లోని రెండు కీలక దేశాల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆ రెండు దేశాల ప్రాదేశిక సమగ్రతకే ముప్పు తెచ్చేలా పరిణమించాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను ప్రశ్నించేలా పొరుగున ఉన్న రష్యా పావులు కదుపుతుండడంతో కొత్తగా ఎన్నికయిన ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమీర్ జెలెన్ స్కీ తన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక స్పెయిన్ విషయానికొస్తే సోషలిస్టులు తమ విజయకేతనాన్ని ఎగరవేయడమే కాకుండా ఎన్నో ఏళ్లుగా స్పెయిన్ నుంచి విడిపోయి కొత్త దేశంగా […] The post ఉక్రెయిన్, స్పెయిన్ రసవత్తర రాజకీయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇటీవల యూరోప్‌లోని రెండు కీలక దేశాల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆ రెండు దేశాల ప్రాదేశిక సమగ్రతకే ముప్పు తెచ్చేలా పరిణమించాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను ప్రశ్నించేలా పొరుగున ఉన్న రష్యా పావులు కదుపుతుండడంతో కొత్తగా ఎన్నికయిన ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమీర్ జెలెన్ స్కీ తన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక స్పెయిన్ విషయానికొస్తే సోషలిస్టులు తమ విజయకేతనాన్ని ఎగరవేయడమే కాకుండా ఎన్నో ఏళ్లుగా స్పెయిన్ నుంచి విడిపోయి కొత్త దేశంగా ఏర్పడాలని పోరాడుతున్న కాటలోనియా ప్రాంతం ప్రత్యేకదేశంగా ఉండాలనే పార్టీలు గెలవడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బ్రెగ్జిట్ (యూరోపియన్ యూనియన్ నుంచి వేరుపడాలని బ్రిటన్) అంశం ఇప్పటికే యూరోప్‌లో పెను ప్రకంపనలకు దారి తీసింది. ఇంకా అది కొలిక్కిరాక కూచుం టే పులి మీద పుట్రలా ఇయుకు ఈ కొత్తగా రెండు దేశాల (స్పెయిన్, యుక్రెయిన్) సమస్యలు వచ్చిపడ్డాయి.

స్పెయిన్‌లోని ఒక ప్రాంతమైన కాటలోనియా తమకు ఎన్నో ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని, అనేక వివక్షలకు గురి అవుతున్నామని, అభివృద్ధి అంతా స్పెయిన్‌లోని మిగతా ప్రాంతానికే పరిమితమైందని పెద్ద ఎత్తున ఉద్య మం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పెయిన్ జాతీయ ప్రభుత్వం వీరి ఆకాంక్షలను పక్కకు పెట్టి కాటలోనియా ప్రత్యేక దేశ ఉద్యమాన్ని అణచివేసి అక్కడి నాయకులను జైళ్లల్లో పెట్టింది. అప్పటినుంచి కాటలోనియా ప్రజలు తమ ప్రత్యేక దేశ కాంక్షను మరింత ఉద్ధృతం చేసి తాజాగా జరిగిన ఎన్నికలలో తమ ప్రతాపాన్ని చూపడం విశేషం. గత నాలుగేళ్లలో స్పెయిన్‌లో మధ్యంతర ఎన్నిక లు జరగడం ఇది మూడోసారి. ఈసారి ప్రత్యేకవాదుల కూటమికి మెజారిటీ స్థానాలు దక్కడంతో ఇక స్పెయిన్ రెండుగా విడిపోడం మినహా ఇంకా మార్గం లేదని తెలుస్తోంది. సోషలిస్టుల నేతృత్వంలోని పెడ్రో శాంచెజ్స్ సోషలిస్టు వర్కర్స్ పార్టీ కూటమికి ఈసారి అధికారం దక్కుతుంది.

ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఉక్రెయిన్ హాస్యనటుడు వోలోదిమీర్ జెలెన్ స్కీ రాజకీయల్లో రంగప్రవేశం చేసి ప్రస్తుత అధ్యక్షుడు పెట్రో పోరోశెంకోను ఓడించాడు. రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య కొన్ని ప్రాంతాలను రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది. తాజాగా తాను ఆక్రమించిన ప్రాంతపు ప్రజలకు రష్యా పాస్ పోర్టులు, పౌరసత్వం ఇస్తామని ప్రకటించడంతో ఏమి చేయాలో ఉక్రెయిన్‌కు పాలుపోవడంలేదు. కొత్త అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర స్థాయిలో స్పందిచడమే కాకుండా ప్రజలను అణచివేస్తున్న ప్రభుత్వాల (పరోక్షంగా రష్యా ను, దాని అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి) బాధితులందరినీ ఉక్రెయిన్ ఆదుకుంటుందని ప్రకటించడం విశేషం.

ఈ రెండు దేశాల మధ్య మళ్లి సంఘర్షణ తప్పదా అనిపిస్తోంది. కొత్త అధ్యక్షుడికి రష్యా ఇంతవరకు మర్యాద కోసమైనా అభినందనలు తెలపనేలేదు. పూర్వపు సోవియెట్ యూనియన్‌లో రాష్ట్రమై ఆ తరువాత సోవియెట్ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. కానీ దాని ప్రాదేశిక సమగ్రతను రష్యా ఇంతవరకు గుర్తించకపోగా క్రెమ్లిన్ అనే ప్రాంతంపై దాడి చేసి రష్యా తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అది అంతటితో ఆగుతుందా లేక ఉక్రెయిన్ భూ భాగంలోకి మరింతగా చొచ్చుకుని వచ్చి కొత్త సవాళ్లు విసిరితే అది నిజంగా యూరోప్‌లో మరో యుద్ధానికి దారితీయవచ్చు.

Results of the presidential election in both countries

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఉక్రెయిన్, స్పెయిన్ రసవత్తర రాజకీయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: