‘జెట్’లో రాజీనామాల పర్వం…

  సిఇఒ, సిఎఫ్‌ఒ, చీఫ్ పీపుల్స్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీలు గుడ్‌బై ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయి సేవలను నిలిపివేసిన ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. సంస్థ ఇక కోలుకునే అవకాశం లేదనే, మరే ఇతర కారణాలో గానీ మొత్తానికి జెట్ ఎయిర్‌వేస్‌ను సీనియర్ మేనేజ్‌మెంట్ వదిలి వెళ్లిపోతోంది. తాజాగా సంస్థ సిఇఒ వినయ్ దుబే, సిఎఫ్‌ఒ అమిత్ అగర్వాల్, చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ రాహుల్ తనేజా, కంపెనీ సెక్రటరీ కులదీప్ […] The post ‘జెట్’లో రాజీనామాల పర్వం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిఇఒ, సిఎఫ్‌ఒ, చీఫ్ పీపుల్స్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీలు గుడ్‌బై

ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయి సేవలను నిలిపివేసిన ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. సంస్థ ఇక కోలుకునే అవకాశం లేదనే, మరే ఇతర కారణాలో గానీ మొత్తానికి జెట్ ఎయిర్‌వేస్‌ను సీనియర్ మేనేజ్‌మెంట్ వదిలి వెళ్లిపోతోంది. తాజాగా సంస్థ సిఇఒ వినయ్ దుబే, సిఎఫ్‌ఒ అమిత్ అగర్వాల్, చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ రాహుల్ తనేజా, కంపెనీ సెక్రటరీ కులదీప్ శర్మలు గుడ్‌బై చెప్పారు. సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) వినయ్ దుబే రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని జెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దుబే 2017లో సంస్థలో చేరారు. చీఫ్ పీపుల్ ఆఫీస్ రాహుల్ తనేజా కూడా తన పదవికి రాజీనామా చేశారు.

రుణదాతలు జెట్ ఎయిర్‌వేస్‌ను దారికి తెచ్చేందుకు ఎతిహాద్‌తో చర్చలు జరుపుతున్న సమయంలో సీనియర్ మేనేజ్‌మెంట్ తప్పుకొంటోంది. దుబే రాజీనామాకు కొన్ని గంటల ముందే కంపెనీ డిప్యూటీ సిఇఒ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సిఎఫ్‌ఒ) అమిత్ అగర్వాల్‌తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన కంపెనీ నుంచి తప్పుకున్నట్లు జెట్ వెల్లడించింది. ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది జెట్ ఇంకా వెల్లడించలేదు. అమిత్ సిఎఫ్‌ఒగా 2015లో కంపెనీలో చేరారు. ఈ పరిణామాలతో మార్కెట్లో జెట్ ఎయిర్‌వేస్ షేర్లు భారీగా నష్టపోయాయి. కాగా జెట్ ఎయిర్ బిడ్ ప్రక్రియకు గడువు మే 10న ముగిసింది.

జెట్‌ను కొనుగోలు చేసేందుకు రెండు బిడ్ లు మాత్రమే వచ్చాయని ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. మరోవైపు ప్రధాన రుణదాత అయిన ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ కూడా బిడ్ వేసింది. ఎతిహాద్‌తో పాటు టిపిజి క్యాపిటల్, ఎన్‌ఐఐపి, ఇండిగో పార్ట్‌నర్స్ కూడా బిడ్‌కు ఆసక్తి చూపించాయి. రుణదాతలు నిధులు ఇవ్వకపోవడంతో ఏప్రిల్ 17న జెట్ విమానాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

Resignations in Jet airways

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘జెట్’లో రాజీనామాల పర్వం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: