హరీష్ ను కలిసిన రిజర్వాయర్ ముంపు బాధితులు

చారకొండ : మండల పరిధిలోని గోకారం గ్రామంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌ నిర్మాణం కారణంగా భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు ఇస్తున్న పరిహారాన్ని పెంచాలని కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ ఎడ్మ కిష్టారెడ్డి శుక్రవారం రాష్ట భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును కోరారు. మండల పరిధిలోని గోకారం, ఎర్రవల్లి తండా, చంద్రాయాన్‌పల్లి గ్రామల రైతులతో కలసి ఎడ్మ కిష్టారెడ్డి హైద్రాబాద్‌కు వెళ్ళి హరీష్‌రావుకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం 5లక్షల 50వేలు ప్రకటించి రైతుల వద్ద అధికారులు […]

చారకొండ : మండల పరిధిలోని గోకారం గ్రామంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌ నిర్మాణం కారణంగా భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు ఇస్తున్న పరిహారాన్ని పెంచాలని కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ ఎడ్మ కిష్టారెడ్డి శుక్రవారం రాష్ట భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును కోరారు. మండల పరిధిలోని గోకారం, ఎర్రవల్లి తండా, చంద్రాయాన్‌పల్లి గ్రామల రైతులతో కలసి ఎడ్మ కిష్టారెడ్డి హైద్రాబాద్‌కు వెళ్ళి హరీష్‌రావుకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం 5లక్షల 50వేలు ప్రకటించి రైతుల వద్ద అధికారులు సంతకాల సేకరణ చేస్తున్నారని, వీటిని పెంచి విటిలో పాటు రైతులకు పునారావాసాని కలిపించి న్యాయం చెయ్యాలని ఎడ్మకిష్టారెడ్డి విన్నవించారు. దీనికి మంత్రి హరీష్‌రావు సానుకులంగా స్పందించినట్టు ఎడ్మకిష్టారెడ్డి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో గోకారం సర్పంచ్ గోజీరెడ్యానాయక్, మాజీ వైస్ ఎంపిపి సాంబయ్యగౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు నకినమోని వెంకటయ్య యాదవ్, ఎర్రవల్లి శ్రీను, వెంకటయ్య తదితరులు ఉన్నారు.

Related Stories: