ఎంఎల్ఏ దత్తత గ్రామంలో పారిశుద్ద లోపం

పాపన్నపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం పెట్టపీట వేస్తున్నా అధికారుల పర్యవేక్షణ లోపంతో కార్యక్రమం నీరుగారుతుంది. మండల కేంద్రమైన పాపన్నపేటలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం కుప్పలు దర్శణమిస్తున్నాయి. స్థానిక ఎంఎల్ఏ పద్మాదేవేందర్‌రెడ్డి దత్తత తీసుకున్న గ్రామమే ఈ విధంగా ఉంటే మండలంలోని 36 గ్రామ పంచాయతీల పరిస్థితి ఏంటని ప్రజలు ఆరోపిస్తున్నారు. అందుబాటులో అధికారులు లేకపోవడం, పూర్తి పర్యవేక్షణ లోపంతో చెత్తకుప్పలు పెరిగిపోయాయని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ […]

పాపన్నపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం పెట్టపీట వేస్తున్నా అధికారుల పర్యవేక్షణ లోపంతో కార్యక్రమం నీరుగారుతుంది. మండల కేంద్రమైన పాపన్నపేటలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం కుప్పలు దర్శణమిస్తున్నాయి. స్థానిక ఎంఎల్ఏ పద్మాదేవేందర్‌రెడ్డి దత్తత తీసుకున్న గ్రామమే ఈ విధంగా ఉంటే మండలంలోని 36 గ్రామ పంచాయతీల పరిస్థితి ఏంటని ప్రజలు ఆరోపిస్తున్నారు. అందుబాటులో అధికారులు లేకపోవడం, పూర్తి పర్యవేక్షణ లోపంతో చెత్తకుప్పలు పెరిగిపోయాయని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈవోపిఆర్‌డి వేణుగోపాల్‌రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాపన్నపేటలోని ప్రధానరహదారి నుండి గ్రామంలోకి వెళ్ళేప్పుడు రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారంతో డంపింగ్ కుప్పలు దర్శణమిచ్చారు.

గ్రామంలోని ఇళ్ల వద్ద నుండి ఉదయం బండ్ల ద్వారా చెత్తను సేకరించి గ్రామ వెలుపల వేయడంతో పాటు వాహనాదారికి రోడ్డుకు ఇరువైపులా, ఎల్లమ్మ ఆలయం వెనుక భాగంలో, వడ్డెర కాలనీకి వెళ్లే దారిలో చెత్తాచెదారాన్ని డంపు చేస్తున్నారు. దీంతో ఇంట్లో చెత్తతీసుకొని ఇంటి ముందే చల్లుకున్నట్లు ఉందని చాలాసార్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా అదే తంతు కొనసాగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా డంపు చేసిన చెత్తకుప్పలకు నిప్పు అంటించడంతో పోగతో గాలి కానరాకుండడంతో పాటు దమ్ము పీల్చుకోలేని విధంగా పోగలు కమ్మేయడంతో ప్రజలు అనారోగ్యంతో పాటు వాతావరణ కాలుష్యం నెలకొంటుంది. చెత్తాచెదారం డంపు చేయడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, పందులు స్వైరవీరాహారం చేస్తున్నాయని దీంతో వివిధ వ్యాదుల భారిన పడుతున్నామని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. నూతన పంచాయతీ పాలక వర్గం కూడా చెత్తను ప్రధాన రహదారికి ఇరువైపుల వేయకూడదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం పట్టించుకోకుండా అలానే చెత్తచెదారాన్ని వేస్తున్నారని పంచాయతీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఇప్పటికే మండలానికి రూర్బన్‌మిషన్ కింద 70 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో గ్రామాల అభివృద్ధి చేయాల్సివుండగా గ్రామాలలో పరిస్థితి దారుణంగా ఉండడంతో రూర్బల్ మిషన్ పథకం కొనసాగుతుందా అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మోరపెట్టుకున్నప్పటికీ ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటున్నరని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పాపన్నపేట మండలంపై దృష్టి సారించి రూర్బల్ మిషన్ సక్సెస్ అయ్యేలా, స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దేలా చూడాలని మండల ప్రజలు కొరుతున్నారు.

Reports On mla padma devender reddy adopt village

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: