ఆలూ రసంతో మచ్చలు మాయం!

  మహిళలు తమ చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు, చర్మం కాంతివంతంగా, మృదువుగా కనిపించేందుకు అనేక రకాల క్రీములు, పౌడర్లు, సబ్బులు వాడుతుంటారు. అయితే అవి అందరికీ పడవు. రసాయనాలతో తయారు చేసినందున వాటిని వాడితే చర్మానికి మేలు జరగకపోగా కొన్ని సార్లు చర్మం వాపులకు లోనై దద్దుర్లు, దురదలు వచ్చి, ఇన్‌ఫెక్షన్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆ ఇబ్బందులు ఎదురవ్వకుండా సహజ సిద్ధమైన పద్ధతిలోనే చర్మ సౌందర్యాన్ని పొందాలంటే అందుకు ఏం చేయాలో […]

 

మహిళలు తమ చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు, చర్మం కాంతివంతంగా, మృదువుగా కనిపించేందుకు అనేక రకాల క్రీములు, పౌడర్లు, సబ్బులు వాడుతుంటారు. అయితే అవి అందరికీ పడవు. రసాయనాలతో తయారు చేసినందున వాటిని వాడితే చర్మానికి మేలు జరగకపోగా కొన్ని సార్లు చర్మం వాపులకు లోనై దద్దుర్లు, దురదలు వచ్చి, ఇన్‌ఫెక్షన్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆ ఇబ్బందులు ఎదురవ్వకుండా సహజ సిద్ధమైన పద్ధతిలోనే చర్మ సౌందర్యాన్ని పొందాలంటే అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.

మంచి గంధం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కొద్దిగా గంధం పొడి తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, కీరదోస రసం, టమాటా రసం కలిపి దాన్ని పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. ఆరిపోయిన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తేసరి. ఇలా తరచూ చేస్తే ముఖం కాంతిని సంతరించుకుంటుంది.

పాలపొడి, నిమ్మరసం, తేనెలను ఒక్కొక్కటి 15 ఎంఎల్ చొప్పున తీసుకుని ఒక పాత్రలో వాటిని వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమానికి అర టేబుల్ స్పూన్ బాదం నూనె కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి. 10 నిమిషాల పాటు ఆగాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో మంచి నిగారింపు వస్తుంది.

నాలుగు లేదా ఐదు బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. పై పొట్టు తీసి వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాయాలి. బాగా ఆరాక నీటితో కడగాలి. ఇలా తరచూ చేస్తే ముఖ సౌందర్యం పెరుగుతుంది.పెరుగు, నారింజ రసం సమాన భాగాల్లో తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. లేదా తేనె-నిమ్మ రసం, కీరదోస-నిమ్మరసం కాంబినేషన్లను కూడా ట్రై చేయవచ్చు. వాటిని రాసి కొద్ది సేపు ఆగాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే ముఖం కాంతిని సంతరించుకుంటుంది.ఆలుగడ్డలను పొట్టు తీసి వాటిని జ్యూస్‌లా పట్టి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు పోతాయి.

Remove dark spots with Potatoes juice

Related Images:

[See image gallery at manatelangana.news]