టెలికామ్, రిటైల్ దన్ను

  క్యూ1లో ఆర్‌ఐఎల్ లాభం రూ.10,104 కోట్లు గత ఏడాదితో పోలిస్తే 6.8 శాతం వృద్ధి న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అంచనాలను అందుకుంది. టెలికామ్, రిటైల్ సెక్టార్ లాభాలు క్యూ1 (ఏప్రిల్‌- జూన్)లో కంపెనీకి ప్రోత్సాహకర ఫలితాలను అందించాయి. క్యూ1లో కంపెనీ నికర లాభం 6.8 శాతం వృద్ధితో రూ 10,104 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.9,459 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం రూ.1,33,069 […] The post టెలికామ్, రిటైల్ దన్ను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్యూ1లో ఆర్‌ఐఎల్ లాభం రూ.10,104 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే 6.8 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అంచనాలను అందుకుంది. టెలికామ్, రిటైల్ సెక్టార్ లాభాలు క్యూ1 (ఏప్రిల్‌- జూన్)లో కంపెనీకి ప్రోత్సాహకర ఫలితాలను అందించాయి. క్యూ1లో కంపెనీ నికర లాభం 6.8 శాతం వృద్ధితో రూ 10,104 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.9,459 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం రూ.1,33,069 కోట్ల నుంచి రూ.1,61,349 కోట్లకు పెరిగింది. 201920 ఆర్థిక సంవత్సరం క్యూ1లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనింగ్, కెమికల్స్, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి వ్యాపారానికి సంబంధించిన స్టాండలోన్ లాభం రూ.9,036 కోట్లు నమోదైంది. ఎబిటా(ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ టాక్స్ డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్) 32 శాతం నమోదైందని కంపెనీ వెల్లడించింది. ఎబిటా 2000 కోట్ల రూపాయలు నమోదైంది. కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ రూ.25,215 కోట్లను రిలయన్స్ టెలికామ్ టవర్ నియంత్రణలో ఉండే ట్రస్ట్‌లో ఇన్వెస్ట్ చేయనుంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ షేరు బిఎస్‌ఇలో 0.70 శాతం పతనమై రూ.1,253 వద్ద ముగిసింది.

జియో లాభం 45.6 శాతం వృద్ధి
రిలయన్స్ జియో ఆపరేషన్స్ రెవెన్యూ రూ 5.2 శాతం వృద్ధితో రూ 11,679 కోట్లకు పెరిగింది. ఇక రిలయన్స్ జియో తొలి త్రైమాసికంలో నికర లాభం 45.6 శాతం వృద్ధితో రూ 891 కోట్లకు పెరిగింది. జియో మొబిలిటీ సేవలు అంచనాలకు మించి వృద్ధి కనబరిచాయని, ఈ త్రైమాసికంలో జియో నెట్‌వర్క్ 11 ఎగ్జాబైట్స్ డేటా ట్రాఫిక్‌ను డీల్ చేసిందని ఆర్‌ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు.

Reliance Jio Q1 net profit 45.6%

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టెలికామ్, రిటైల్ దన్ను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: