రెండో మోస్ట్ పాపులర్ బ్రాండ్ ‘జియో’

  న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో ఘనత సాధించింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో రెండవ స్థానాన్ని పొందింది. ఈ జాబితాలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టి జియో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది సర్వేలో జియో మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఐపోసిస్ 2019 సర్వే లెక్కల ప్రకారం, మరో టెలికాం దిగ్గజం, జియో ప్రధాన పోటీదారు భారతి […] The post రెండో మోస్ట్ పాపులర్ బ్రాండ్ ‘జియో’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో ఘనత సాధించింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో రెండవ స్థానాన్ని పొందింది. ఈ జాబితాలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టి జియో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది సర్వేలో జియో మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఐపోసిస్ 2019 సర్వే లెక్కల ప్రకారం, మరో టెలికాం దిగ్గజం, జియో ప్రధాన పోటీదారు భారతి ఎయిర్‌టెల్ ఎనిమిదో స్థానం సంపాదించింది. 2016 టెలికాం మార్కెట్లోకి ప్రవేశించిన జియో మూడేళ్లలోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. 30 కోట్లకు పైగా యూజర్లతో జియో సంచలనం సృష్టించగా, తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అయితే టాప్10లో టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు నిలవగా, విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం మూడవ స్థానం, మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్ నాలుగు, జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ ఐదవ స్థానం దక్కించుకున్నాయి.

Reliance Jio India 2nd most popular brand

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రెండో మోస్ట్ పాపులర్ బ్రాండ్ ‘జియో’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: