నేడు రిలయన్స్ ఎజిఎం

Reliance Jio

 

అందరి దృష్టీ దానిపైనే

ముంబయి: సోమవారం జరగబోయే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల సర్వసభ్య సమావేశం(ఎజిఎం)పైనే అందరి దృష్టి ఉంది. ఈ సమావేశంలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. జియో గిగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు, కొత్త జియో ఫోన్ మోడల్ 3 వివరాలను ఈ సమావేశంలో ప్రకటిస్తారని తెలుస్తోంది. గత ఏడాది ఎజిఎంలో సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ జియో గిగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, టివి ఫిక్స్‌డ్, ల్యాండ్‌లైన్లతో వస్తుందని చెప్పారు. అప్పటినుంచి వివిధ నగరాల్లో గిగా ఫైబర్‌బ్రాండ్‌ను పరీక్షించడం మొదలుపెట్టారు. అయితే దేశంలో 1600 నగరాల్లో దీన్ని ప్రారంభించాల్సి ఉంది. గత రెండేళ్లుగా జరిగిన ఎజిఎంలలో జియో ఐఫోన్ మోడల్‌తో విజయవంతంగా ప్రజల ముందుకు వచ్చింది. ఈ ఎజిఎం జియో మోడల్ 3 ఫోన్‌ను తీసుకు వచ్చే అవకాశం ఉంది.

Reliance Jio GigaFiber, Jio Phone 3 set for launch

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేడు రిలయన్స్ ఎజిఎం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.