రూ.9.5 లక్షల కోట్లు దాటింది

Mukesh Ambani

 

మార్కెట్ విలువలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు
ఈ మార్క్‌ను దాటిన తొలి దేశీయ కంపెనీ

ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి తన సత్తా చాటింది. సోమవారం కంపెనీ షేరు విలువ 3 శాతం పెరగడంతో సంస్థ మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.9.50 లక్షల కోట్లు దాటింది. ఈ మార్క్‌ను దాటిన తొలి దేశీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు సృష్టించింది. ముంబై స్టాక్ మార్కెట్లో మంగళవారం కంపెనీ స్టాక్ 3.4 శాతం పెరిగి రూ.1508 కు చేరుకుంది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ స్టాక్ 34 శాతం పెరిగింది. కంపెనీ గత నెలలోనే రూ.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించింది. గత వారం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.30 లక్షల కోట్ల స్థాయిని తాకింది.

గత వారంలో చాలా కంపెనీలు మార్కెట్ విలువను పెంచుకున్నాయి. శుక్రవారం ముగిసిన ట్రేడింగ్ వారంలో రిలయన్స్ మార్కెట్ అగ్రస్థానంలో ఉంది. కంపెనీల గత వారం మార్కెట్ విలువ టిసిఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,93,666 కోట్లు పెరిగి రూ.8,16,068.63 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వాల్యుయేషన్ రూ.15,182 కోట్లు పెరిగి రూ .9,31,412.63 కోట్లకు చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ.12,917 కోట్లు పెరిగి రూ .6,99,704 కోట్లకు చేరుకుంది.

మార్కెట్ విలువ టాప్ 5 కంపెనీలు
కంపెనీ                          మార్కెట్ క్యాప్ (రూ.)
రిలయన్స్ ఇండస్ట్రీస్                          9.55 లక్షల కోట్లు
టిసిఎస్                                       7.91 లక్షల కోట్లు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్                           6.95 లక్షల కోట్లు
హిందూస్థాన్ యుని                           4.42 లక్షల కోట్లు
హెచ్‌డిఎఫ్‌సి                                   3.82 లక్షల కోట్లు

Reliance Industries crosses Rs 9.5 lakh crore

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూ.9.5 లక్షల కోట్లు దాటింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.