సాహిత్యకారుల స్మరణికలో శిఖామణి

  అమ్మ చేతి ముద్ద అమృతం, అమ్మ ఒడి స్వర్గం బాల్యంలో అమ్మ లేకపోవడమంటే తీరని లోటు కాదు కాదు నిజంగా అదొక శాపమే. నా చిన్నప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా అమ్మ నాన్న ఇద్దరు బెంగుళూరులో ఉద్యోగం చేసేవారు అందువల్ల నేను స్వగ్రామమైన పులివెందులలో నానమ్మ దగ్గరే పెరిగాను. దాదాపు పది సంవత్సరాలు అమ్మగారు నాకు దూరమనే చెప్పాలి. ఊహ తెలిసిన తర్వాత అమ్మ ఎందుకు లేదు? ఎప్పుడో ఒకసారి ఎందుకు వచ్చి వెళ్ళిపోతుంది? లాంటి […]

 

అమ్మ చేతి ముద్ద అమృతం, అమ్మ ఒడి స్వర్గం బాల్యంలో అమ్మ లేకపోవడమంటే తీరని లోటు కాదు కాదు నిజంగా అదొక శాపమే. నా చిన్నప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా అమ్మ నాన్న ఇద్దరు బెంగుళూరులో ఉద్యోగం చేసేవారు అందువల్ల నేను స్వగ్రామమైన పులివెందులలో నానమ్మ దగ్గరే పెరిగాను. దాదాపు పది సంవత్సరాలు అమ్మగారు నాకు దూరమనే చెప్పాలి. ఊహ తెలిసిన తర్వాత అమ్మ ఎందుకు లేదు? ఎప్పుడో ఒకసారి ఎందుకు వచ్చి వెళ్ళిపోతుంది? లాంటి అనేక ఆలోచనలతో సతమతం అయ్యేవాడిని. నేటితరం ఆధునిక తెలుగు కవుల్లో శిఖామణి పేరుతో సుపరిచితమైన కర్రి సంజీవరావు పుట్టినప్పటి నుండి తల్లి ప్రేమకు దూరమయ్యారు. పెంచి పోషించిన శిఖామణి గారి పేరుపై రచనలు చేస్తూ పెంచిన వారి పట్ల సహ్రుదయాన్ని చాటుకున్నారు. మొదట లావణ్య అనే కలం పేరుతో రచనలు చేసేవారు ఆ తర్వాత శిఖామణి పేరుతో తెలుగు సాహిత్య లోకంలో గుర్తింపు పొందారు. వీరి కవిత్వం హిందీ, ఇంగ్లీషు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లోకి అనువాదమైంది.

2015 లో వారు స్మరణిక పేరుతో ఒక సాహిత్య వ్యాస సంపుటి విడుదల చేశారు. సాహిత్యవేత్తల వర్థంతి, జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ రాసిన వ్యాసాలు. శిఖామణిది సుదీర్ఘమైన సాహిత్య నడక ఉన్నది. ఆ నడకలో వారితో పాటు ప్రయాణించి ఒంటరి చేసిపోవడంతో వారితో ఉన్న అనుబంధాన్ని చర్చిస్తూ సాగిన వ్యాసాలే స్మరణికలో ఉన్నవి. వ్యాస కర్తకు వ్యాసం రాసేవారిపై ప్రత్యక్ష అనుబంధం ఉంది కాబట్టి సాహిత్య అంశాలతో పాటు సాహిత్యవేత్తల అనుభవాలు, ఆలోచనలు ఎలా ఉండేవో కూడా వ్యాసాల్లో కనపడుతుంది. స్మరణిక చదివితే తెలుగు సాహిత్య లోకంలో ఎంతోమంది సాహిత్యవేత్తల గురించి వారి రచనా వ్యాసంగం గురించి తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం యువకులకు అత్యంత విలువైనది. 1992 నుండి 2015 దాకా రాసిన వ్యాసాలు. 34 వ్యాసాలు ఉన్నాయి ఇందులో దాదాపు ఆంధ్రజ్యోతి సాహిత్య పేజిలో ప్రచురణ అయినవే.

ఆప్తవాక్యం రాసిన తనికెళ్ల భరణి. ఎన్నో బాంధవ్యాలను కుట్టే సూదిలా జారిపోయాడు నాన్నా అని తనికెళ్ల భరణి వారి నాన్న మరణించినప్పుడు రాసుకున్న వాక్యాన్ని స్మరించుకున్నారు. మొదట వారు రాసిన వాక్యాన్ని పరిశీలిస్తే నాన్న ఎ న్నో బంధాలను మనకు పరిచయం చేస్తాడు. ఉదాహరణకు మన పుట్టుకకు కారణం తానే ఆ విధంగా అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, అక్క, చెల్లి ఇలా ఒక కుటుంబాన్ని మనకు ఇస్తాడు. సూది కలపడానికి ప్రయత్నం చేస్తుంది అందుకే వారు ఆ ఉపమానం వాడారు. వస్తువు చిన్నదైనప్పటికి చేసే పని పెద్దది. సాహిత్యవేత్తలతో పాటు శిఖామణి అత్యంత ఆత్మీయులను పోగొట్టుకున్నప్పుడు రాసిన వాక్యాలుఇందులో ఉన్నా యి. ఆ వ్యాసాలు చదివినప్పుడు శిఖామణి వ్యక్తిత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. ఇక పుస్తకంలోని వ్యాసాలపై నా విశ్లేషణ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.

మద్దూరి నగేష్ బాబు గురించి రాస్తూ పాఠకునితో కవి నేరుగా మాట్లాడే ఒక సంభాషణాత్మక రచనా విధానం వారి కవిత్వం అంటూనే తెలుగు కవిత్వంలో నగేష్ బాబు ఒక కల్లోలం అని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి సో కాల్డ్ గొప్ప కవిత్వం రాస్తున్నామని ఫీల్ అయ్యే కొంతమంది కవిత్వం నేడు రీడర్ హృదయాలను తట్టలేక పోతోంది. అసహజ ఉపమానాలు, అర్థంకాని ఇమేజనరీస్ కవిత్వానికి పాఠకులకు మధ్య దూరాన్ని పెంచుతూనే వచ్చాయి. దళిత సాహిత్యమూ మద్దూరి నగేష్ బాబు, కలేకూరి ప్రసాద్ ఒక విప్లవమనే చెప్పాలి తెలుగు కవిత్వ లోకాన్ని ఒక్కసారిగా వారివైపు చూ సేలా చేసినవారు వారిద్దరూ. కలేకూరి అక్షరాలు నిప్పు కణికలై దోపిడీ వర్గాన్ని చెండాడాయి. భాష విషయంలో కొందరు అభ్యంతరాలు తెలిపినప్పటికీ అది కేవలం పీడిత వర్గపు బాధగానే చూడాలనేది నా భావన.

దళిత సాహిత్యం అంటే దళితులు మాత్రమే కాదని ఎవరైనా దళిత సాహిత్యాన్ని రాయవచ్చు చర్చించవచ్చనని తెలిపిన వారు నగేష్ బాబేనని శిఖామణి తెలియజేశారు. అందులో భాగంగానే హెచ్చార్కే, సుజాత, పట్వారి, రాంరెడ్డి లాంటి కవులు వచ్చారన్నారు. రాచపాళెం నేడు వస్తున్న సాహిత్యాన్ని రెండు విధాలుగా చూడవచ్చు అని ఒక వ్యాసంలో తెలిపారు. 1.రచయిత సొంతంగా అనుభవించిన వాటిని సాహిత్య రూపంలో సమాజానికి అనునయించి రాయడం. 2.రచయిత చూసిన, తెలుసుకున్న విషయాలను పరిశీలించి, విషయాన్ని పూర్తిగా తెలుసుకొని రాయడం. సొంత వస్తువులను లేదా జీవిత వస్తువులను సాహిత్యం చేయడం విశేషమే కాని ఇతరుల బాధలు తెలుసుకొని, అవగాహన చేసుకొని న్యాయాన్యాయాలు అవగతం చేసుకొని చరిత్ర ఏమి చెప్పిందో చూసి నిర్మొహమాటంగా రాసేవారి పని ఎక్కువగా ఉంటుంది.

హేమలత లవణం గురించి చెప్తూ వారి సామాజిక సేవ అత్యంత విలువైనదని అలాగే జోగిని వ్యవస్థపై వారు పోరాడి ఆ వ్యవస్థ నిర్మూలనకు ముఖ్య కారకులు వారేనని శిఖామణి చెప్పడం జరిగింది. ఇంతకీ హేమలత లవణం ఎవరో తెలుసా ప్రఖ్యాత కవి గుర్రం జాషువా కుమార్తె. ఆనాటి కవులు ప్రజా సమస్యలపై సాహిత్యం రాస్తూనే ప్రత్యక్ష పోరాటాల్లో నిలబడి ప్రజల పక్షాన ఉండేవారు. నేడు అలాంటి పరిస్థితులు లేవు. సాహిత్యం ఒక ఎంటర్ టైన్ మెంట్ అయిపోయిందనే విమర్శ కూడా ఉన్నది దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే జాషువాగురించి రాసిన వ్యాసంలో ఒక రచన శోధించడానికి భావనా పటిమా, భాషా వైదుష్యంతో పాటు కవి వ్యక్తిత్వం పరోక్షంగా దోహదం చేస్తుంది అన్నారు. నాటి కవులు వ్యక్తిత్వం విషయంలో పరిశీలిస్తే జాషువా కులం, మతం లేని దేశం కోసం పోరాడారు ఆ విషయంలో ఎక్కడ రాజీపడలేదు. నేడు సాహిత్యం ఎంత బాగున్న వ్యక్తిత్వం కరువైంది సహజంగా కవులు సున్నితులు అంటారు కాని నేడు అది కనపడుట లేదు.

నా దహన సంస్కారానికి నేను హాజరౌతాను కదా ఇంకా ఎందుకు మీకీ ఏడుపు అని పలికిన ‘మో’ గురించి మూడు వ్యాసాలు ఉన్నాయి. శిఖామణి వారితో ఉన్న అనుబంధాన్ని తెలుపుతూనే వారి సాహిత్య సేవ గురించి విపులంగా చర్చించిన వ్యాసాలు. అలాగే శిఖామణికి ఆత్మీయులైన బాబీ గురించి దుఃఖ భరితమైన వ్యాసం రాశారు. బాబీ వారి ఊరిలో పూలు అమ్ముకునే ఒక అబ్బాయి. చిన్నవయసులో మరణించిన వారిని తలుచుకుంటూ రాసిన వ్యాసం. నేను మరణించినప్పుడో, నాకు సన్మానం జరుగుతున్నప్పుడో బాబీ కుట్టిన మాల నాకు చేరదా అనుకున్నాను కాని నేనే ఈ అక్షరమాల వేస్తాను అనుకోలేదు అనే వాక్యం చదివినప్పుడు గుండె బరువెక్కుతుంది. మన చుట్టూ ఉన్నవారు మన ఆత్మీయులు దూరమైతే కలిగే బాధ అక్షరాల్లో కదిలింది.

బాబీ గురించి రాసిన కవిత యొక్క కొన్ని పంక్తులను వ్యాసంలో పొందుపరిచారు. అందులోని ఒక వాక్యం నన్ను ఒక కుదుపు కుదిపేసింది అనుకోండి. నాలుగు అక్షరాలు నేర్చుకోవాల్సిన వయసులో వీధి వీధికి తిరుగుతూ కేకలేసుకుంటూ తన బాల్యాన్ని మూర మూర చొప్పున కోసి అమ్ముకుంటున్నాడు కవి వస్తువును కవిత్వం చేయడమంటే ఇదే ఇలాంటిదే నేడు కరువవుతోంది ఈ వాక్యంలో శిఖామణి వాడిన ప్రతీకలు అందరికి అర్థమయ్యేలా ఉండటం వల్ల సాధారణమైన రీడర్ కి కూడా అందులోని భావం చేరుతుంది. పూలమ్మే ఒక పిల్లవాడి బాల్యం ఎలా చితికిపోతోందో చెప్పడానికి తానూ అమ్మేది పూల మూరలు కాదు తన బాల్యమని చెప్పారు. చేరా, బోయి భీమన్న, ఎండ్లూరి చిన్నయ్య, శివ సాగర్, ఇస్మాయిల్ లాంటి గొప్ప గొప్ప సాహిత్య దిగ్గజాలతో వారికున్న ఆత్మీయతను పంచుకుంటూ వారి సాహితీసేవలను ప్రస్తావిస్తూ రాసిన గొప్ప రచన స్మరణిక.

Release of the literary essay with Smaranika name in 2015

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: