బడిలో.. ఎన్నికల గంట

  విద్యాకమిటీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల 22న నోటిఫికేషన్ 30న ఎన్నికల నిర్వహణ చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక అవసరమైతే రహస్య బ్యాలెట్ విధానం ఇటిక్యాల : ఈ నెల 30వ తేదీన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ( ఎస్‌ఎంసి) ఎన్నికలు జరగనున్నాయని ఇటిక్యాల మండల విద్యాధికారి ఇ.రాజు తెలియజేశారు. 22న నోటిఫికేషన్‌ను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉదయం 10.00 గం.లకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2.00 గం.లకు ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. 25వ […] The post బడిలో.. ఎన్నికల గంట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విద్యాకమిటీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
22న నోటిఫికేషన్ 30న ఎన్నికల నిర్వహణ
చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక
అవసరమైతే రహస్య బ్యాలెట్ విధానం

ఇటిక్యాల : ఈ నెల 30వ తేదీన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ( ఎస్‌ఎంసి) ఎన్నికలు జరగనున్నాయని ఇటిక్యాల మండల విద్యాధికారి ఇ.రాజు తెలియజేశారు. 22న నోటిఫికేషన్‌ను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉదయం 10.00 గం.లకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2.00 గం.లకు ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. 25వ తేదీ సాయంత్రం 4.00గం.ల వరకు ఈ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి 26వ తేదీ ఉదయం 11.00 గంటలకు తుది జాబితా విడుదల చేస్తారు. ఎన్నికలు జరుగు ఎన్నికల ఓటర్ల జాబితాలోని తల్లిగానీ, తండ్రిగానీ లేక సంరక్షకులుగానీ ఒకరే ఓటుకు అర్హులు. ఓటర్లలో 50శాతం హజరు కాకపోతే కోరం లేనట్లే. ముందుగా సభ్యులను చేతులేత్తే పద్దతిన లేక మూజువాణి ఓటుతో తప్పనిసరి పరిస్థితుల్లో రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్దతిన నిర్వహిస్తారు.

* ఎన్నిక ఇలా
సభ్యులను 30వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎన్నుకుంటారు. 1.30గంటలకు నూతన సభ్యుల ఏర్పాటు చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల అనంతరం వారి ప్రమాణ స్వీకారం వెంటనే ప్రథమ ఎస్‌ఎంసి సమావేశం మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 వరకు నిర్వహిస్తారు.

* సభ్యుల ఎన్నిక ఇలా
ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులను ఎన్నుకుంటారు. వీరిలో ఇద్దరు మహిళలుంటారు. ఇందులో ఒకరు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటున్న వారి పిల్లల అనాథ, ఎస్సి, ఎస్టి, వలసల, వీధిబాలల, ప్రత్యేక అవసరాల పిల్లల, హెచ్‌ఐవి బారినపడ్డ పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరిని ఎన్నుకోవాలి. మరోకరు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు (బిసి, మైనార్టీ వార్షికాదాయం రూ60వేలుమించని ఒసి తల్లిదండ్రుల పిల్లల ) తల్లిదండ్రులను ఒకరిని ఎన్నుకోవాలి.

మూడో వ్యక్తిని ఎవరినైనా ఎన్నుకోవచ్చు. ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులుంటే తరగతికి ముగ్గురు చొపున, ప్రాథమికోన్నత పాఠశాలలో 7వతరగతి వరకు ఉంటే 21మందిని, 8వతరగతి వరకు ఉంటే 24 మంది సభ్యులను, హైస్కూళ్లలో 6,7,8 తరగతుల తల్లిదండ్రుల్లో 9 మందిని సభ్యులుగా ఎన్నుకోవాలి. ఎస్‌ఎంసిలో ప్రధానోపాధ్యాయులే కన్వీనర్‌గా ఉంటారు. మరో సీనియర్ ఉపాధ్యాయులు, వార్డు మెంబరు/ కౌన్సిలర్, ఎఎన్‌ఎం, మహిళా సమాఖ్యా అధ్యక్షులు, అంగన్‌వాడీ కార్యకర్త ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తారు.

Release of Schedule for Academic Committee Elections

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బడిలో.. ఎన్నికల గంట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: