బోల్డ్‌గా నటించడం వేరు వల్గారిటీ వేరు

  అందాల భామ రెజీనా కసాండ్రా ‘ఎవరు’ చిత్రంతో గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ భామ ఇటీవల ’ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లాగా’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా బోల్డ్ పాత్ర పోషించింది. సోనమ్, రెజీనా లకు మధ్య లవ్ స్టోరీ ప్రధానాం శంగా ఈ సినిమా సాగుతుంది. లెస్బియన్ లవ్ ఇండియన్ స్క్రీన్‌కు […] The post బోల్డ్‌గా నటించడం వేరు వల్గారిటీ వేరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అందాల భామ రెజీనా కసాండ్రా ‘ఎవరు’ చిత్రంతో గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ భామ ఇటీవల ’ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లాగా’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా బోల్డ్ పాత్ర పోషించింది. సోనమ్, రెజీనా లకు మధ్య లవ్ స్టోరీ ప్రధానాం శంగా ఈ సినిమా సాగుతుంది. లెస్బియన్ లవ్ ఇండియన్ స్క్రీన్‌కు కొత్త కాకపోయినా మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో మాత్రం ఇదే మొదటిసారి. ఈ సినిమా గురించి రెజీనా మాట్లాడుతూ “లేడీ డైరెక్టర్ షెల్లీ చోప్రా ఒకరోజు నాకు ఫోన్ చేసి విధు వినోద్ చోప్రా ప్రొడక్షన్ హౌస్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి ఈ సినిమా గురించి వివరించింది. హిందీలో డెబ్యూ సినిమానే బోల్డ్ పాత్ర కావడంతో నిర్ణయం తీసుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాను. చివరికి ఛాలెంజింగ్ పాత్రలను వదులుకోకూడదని ఈ సినిమాకు ఓకే చెప్పాను. ఇక బోల్డ్‌గా నటించడం వేరు వల్గారిటీ వేరు. రెండింటి మధ్య తేడా ఉంటుంది. లెస్బియన్ పాత్రలో నటించడం ఒకరకంగా సమాజంలోని కట్టుబాట్లను ఎదిరించడమే”అని పేర్కొంది.

Regina will play bold role in Hindi Debut movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బోల్డ్‌గా నటించడం వేరు వల్గారిటీ వేరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: