సరికొత్తగా పౌర సరఫరా…!

  దేశంలో ఎక్కడ ఉన్నా.. అందుబాటులోకి రేషన్! ప్రజా పంపిణీలో మరిన్ని సంస్కరణలకై ప్రయత్నం ఇప్పటికే ఈ పోస్ విధానంతో రాష్ట్రంలో దిగ్విజయం నూతనంగా మరో మార్పుతో మరింత ప్రయోజనం నల్లగొండ : ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చౌకధర దుకాణాల్లో ఈపోస్ విధానాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకుళ్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్క డి నుంచైనా రేషన్ తీసుకునేందుకు వీలుగా […] The post సరికొత్తగా పౌర సరఫరా…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశంలో ఎక్కడ ఉన్నా.. అందుబాటులోకి రేషన్!
ప్రజా పంపిణీలో మరిన్ని సంస్కరణలకై ప్రయత్నం
ఇప్పటికే ఈ పోస్ విధానంతో రాష్ట్రంలో దిగ్విజయం
నూతనంగా మరో మార్పుతో మరింత ప్రయోజనం

నల్లగొండ : ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చౌకధర దుకాణాల్లో ఈపోస్ విధానాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకుళ్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్క డి నుంచైనా రేషన్ తీసుకునేందుకు వీలుగా కెసిఆర్ ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలులోకి తీసుకరాగా, అదే మాదిరిగా దేశం యావత్తులో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందేందుకు వీలుగా వినూత్న రీతిలో సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మాదిరిగానే దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా రేషన్ పొందేలా కసరత్తు ప్రారంభించింది కేంద్రం.

ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రవేశపెడుతున్న ఈ సరికొత్త విధానంతో బడుగు జీవులను ఎంతో మేలు జరుగబోతుంది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా ఎక్కడైనా చౌకధర దుకాణాల్లో సరుకులు తీసుకునేందుకు ఎలాంటి దిగులు అవసరం లేదం టూ కేంద్ర ప్రభుత్వం తాజాగా భరోసా ఇచ్చింది. ఈ పాటి కే ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న బ డుగు జీవులకు మేలు చేసేందుకు రాష్ట్రం లో ఈ పోస్ విధానం అమలుపరుస్తుండగా, దేశ వ్యా ప్తంగా ఒకే దేశం, ఒకే కార్డు నినాదంతో దేశంమొత్తంలో అమలుపర్చేందుకు కేంద్ర ప్రజాపంపిణీ వ్యవస్థలో మరో సంస్కరణ తెరలేపింది. ఈ నేపధ్యంలో తాజాగా కేంద్ర తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చినవెంటనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా వేలాది మంది కార్డుదారులకు మరింత ప్రయోజనం చూకూరనుంది. అణగారిన వర్గాలతో పాటు అల్పాదాయవర్గాలకు ఆహార భద్రత చట్టం కింద ప్రభుత్వం ఆ హార భద్రత కార్డులు కల్గిన వారందరికి కిలో బియ్యాన్ని రూపాయికే అమలుపరుస్తున్న విషయం తెలిసిందే.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అమలవుతున్న పథకాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ముందుకెళ్తుంటాయి. పథకం అమలు బాధ్యత మాత్రం రాష్ట్రాలు పర్యవేక్షించడంతో పాటు నిశిత దృష్టి సారిస్తుంది. ఉపాధి నేపథ్యంలో రాష్ట్రంలో, దేశంలో ఎంతో మంది ఒక చోటు నుంచి మరోచోటుకు వలసలు వెళ్ళడం ఆనవాయితీ కాడం, అదే క్రమంలో రేషన్ సరుకులు పొందే విషయంలో సమస్యలు ఎదుర్కొవవడం కూడా జరిగిపోతుంటాయి. దీంతో లబ్దిదారుల లేకుండా వారి పేరు తో మాత్రం సరుకులు క్లెయిమ్ కావడం కూడా సర్వసాధారణంగా అక్రమాలకు ఆస్కారం కల్గేది. ఇలాంటి అక్రమాలన్నింటికి చరమగీతం పాడేందుకు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈపోస్ విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. కార్డుదారుల వేలిముద్రలు ఉంటేనే సరుకులు క్లెయిమ్ చేసే విధం గా రాష్ట్రంలో అమలవుతుండగా, తాజాగా కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేవారికి అక్కడే సరుకులు అందజేసేందుకు పోర్టబులిటీ పేరిట రాష్ట్రంలో ఎక్క డ ఉన్నా సరుకులు తీసుకునే విధానం అములులోకి వచ్చింది.

దీంతో రా ష్ట్రంలో ఎ చౌకధరల దుకాణానికి వెళ్ళినా సరుకులు తీసుకునే వెసులుబా టు ప్రస్తుతం కార్డుదారులకు కల్గుతోంది. గతంలో కార్డు ఎక్కడ ఉంటే, ఎ రేషన్‌షాపుకు కేటయిస్తే అక్కడే సరుకులు తీసుకునే అవకాశం ఉండేది. పెద్ద పట్టణాల్లో కూడా ఇళ్ళు మారితే దూరంలో ఉన్నా సరే కేటాయించిన షాపుకు వెళ్ళి సరుకులు పొందాల్సిరావడం ఉండేది. ప్రస్తుతం ప్రజా పంపిణీలో ప్రభుత్వాలు తీసుకొచ్చిన సమూల మార్పులతో అందుబాటులో ఉ న్న షాపులో సరుకులు పొందవచ్చు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఒకే దే శం, ఒకే కార్డు నినాదంతో దేశంమొతంలో అమలులోకి వస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా వివిద ప్రాంతాలకు వలస వెళ్ళే కుటుంబాలకు మేలు జరుగనుంది. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ముంబాయి, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలైనా చుట్టుపక్కల ప్రాంతాలకు వివిద పనుల నిమి త్తం, ఉపాధి కోసం వెళ్ళేవారికి కేంద్ర నిర్ణయం మరింత ప్రయోజనం చే కూర్చునుంది. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న పోర్టబులిటి విధానం దేశ వ్యాప్తంగా అమలయ్యేందుకు అవసరమైన కసరత్తును కేంద్ర ప్రభు త్వం చేపడుతుండడంతో కార్డుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Reforms in Public Distribution

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సరికొత్తగా పౌర సరఫరా…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: