ఫోన్ కాల్స్ రింగింగ్ సమయాన్ని తగ్గించిన టెలికాం సంస్థలు

time of ringing

 

ఫోన్ కాల్ రింగింగ్ సమయాన్ని టెలికాం సంస్థలు తగ్గించాయి. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ ఫోన్ కాల్స్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ఇప్పటి వరకు 30 నుంచి 45 సెకన్ల పాటు ఫోన్ కాల్స్ రింగ్ అయ్యేవి. కానీ ఇకపై తగ్గించిన సమయం మేర రింగ్ అవుతాయి. అయితే ఆ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటానికి గల కారణం జియోనే అని తెలుస్తోంది. ఇటీవలే జియో ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి (ఐయూసీ) నిబంధనలకు విరుద్ధంగా రింగింగ్ సమయాన్ని 20 సెకన్లకు తగ్గించి.. మళ్లీ 5 సెకన్లు పెంచి.. ఆ సమయాన్ని 25 సెకన్లు చేసింది.

దీంతో జియో బాటలోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఆ సమయాన్ని 25 సెకన్లకు కుదించాయి. అయితే వొడాఫోన్ ఐడియా మాత్రం దేశంలోని పలు ప్రాంతాల్లో కాల్స్ రింగింగ్ సమయాన్ని పాత పద్ధతిలోనే కొనసాగిస్తున్నాయి. సాధారణంగా కాల్ చేసిన నెట్‌వర్క్ వారు కాల్ ముగిసిన నెట్‌వర్క్‌కు ఐయూసీ చార్జిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు ఈ విధానంలో అధికంగా ఆదాయం సమకూరుతోంది.

దీంతో జియో రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు కుదించిందని, ఈ క్రమంలో రింగింగ్ సమయం తగ్గడం వల్ల కాల్ చేస్తే అవి మిస్డ్ కాల్స్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందని, కనుక అవతలి వ్యక్తులు కాల్స్ చేస్తే అప్పుడు ఆ నెట్‌వర్క్ వారు ఇవతలి నెట్‌వర్క్‌కు ఐయూసీ చార్జిలు చెల్లించాలి కాబట్టి.. తమకు ఆ ఖర్చు తగ్గుతుందని జియో భావిస్తుందని, అందుకనే ఆ కంపెనీ రింగింగ్ సమయాన్ని తగ్గించిందని ఇతర టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ వాదనలను జియో కొట్టి పారేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం కాల్స్ రింగింగ్ సమయం 15 నుంచి 20 సెకన్లు ఉంటే సరిపోతుందని జియో తెలిపింది. ఈ క్రమంలో ఈ విషయంపై స్పందించిన‌ ట్రాయ్ నెట్‌వర్క్ ఆపరేటర్లు సమావేశమై ఒక ఒప్పందం చేసుకోవాలని సూచించింది.

Reduced time of ringing Phone Calls

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫోన్ కాల్స్ రింగింగ్ సమయాన్ని తగ్గించిన టెలికాం సంస్థలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.