తగ్గిన పోలింగ్ శాతం…అయోమయంలో అభ్యర్థులు

ఆదిలాబాద్ :ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి గురువారం జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. సరిగ్గా నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా, ఈ సారి మాత్రం 71.45 శాతానికే పరిమితం కావడం గమనార్హం. ఎన్నికలలో బరిలో నిలిచిన అభ్యర్థులు హోరాహోరి ప్రచారం చేయగా, గతంలో కంటే భిన్నంగా జిల్లా ఓటర్లు […] The post తగ్గిన పోలింగ్ శాతం… అయోమయంలో అభ్యర్థులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ :ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి గురువారం జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. సరిగ్గా నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా, ఈ సారి మాత్రం 71.45 శాతానికే పరిమితం కావడం గమనార్హం. ఎన్నికలలో బరిలో నిలిచిన అభ్యర్థులు హోరాహోరి ప్రచారం చేయగా, గతంలో కంటే భిన్నంగా జిల్లా ఓటర్లు స్పందించడంతో గెలుపోటముల సమీకరణాలు మారే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సర్వేలన్ని మరోసారి టీఆర్‌ఎస్ ఆదిలాబాద్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని చెబుతుండగా, ఎవరు గెలుస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ముగియడం, అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కావడం, ఫలితాలు వెల్లడయ్యేందుకు మరో 40 రోజుల గడువుండడంతో బూత్‌ల వారీగా పోలైన ఓట్లు, అక్కడి ఓటర్ల స్పందనను అంచనా వేస్తూ మెజార్టీ ఎంత వస్తుందనే విషయంపై టీఆర్‌ఎస్ అభ్యర్థులు నిమగ్నమయ్యారు.

ఇక మిగిలిన పార్టీల అభ్యర్థులు మాత్రం గెలుపోటములపై స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులతో చర్చిస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం వీవీప్యాట్‌లపై అవగాహన కల్పించడంతో పాటు ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ పోలింగ్ శాతం పెరిగేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చినప్పటికీ ఎండల తీవ్రత కారణంగా ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారని అంటున్నారు. ఇదిలాఉంటే 2014 ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ నమోదు కావడంతో అభ్యర్థుల భవితవ్యం తారుమారయ్యే అవకాశం ఉందని పలువురు పేర్కొంటుండగా, టిఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రం ఇది తమకు లాభిస్తుందని ఈసారి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఉత్సాహంగా ముందుకు రావడం టిఆర్‌ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్‌గా చెప్పుకుంటున్నారు. రైతుబంధు, ఆసరా ఫించన్లు, కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ లాంటి పథకాలతో లబ్ది పొందిన గ్రామీణ ప్రాంత ప్రజలంతా మరోసారి కేసీఆర్‌కు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారని అంటున్నారు.

పటిష్ట కేడర్ ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంతో పాటు మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను వివరించడంలో పోటీ పడడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రక్రియ ముగిసి ఈవీఎంలలో తమ భవితవ్యం నిక్షిప్తం కావడంతో మే 23న కౌంటింగ్‌లో ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారో తెలుస్తుందని పేర్కొంటున్నారు.

Reduced polling percentage and confused candidates

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తగ్గిన పోలింగ్ శాతం… అయోమయంలో అభ్యర్థులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: