మూసికారిడార్‌లో యాంటి లార్వా ఆపరేషన్‌తో తగ్గిన దోమల బెడద…

mosquitoes

సిటీబ్యూరో : మహానగరం మధ్య నుండి ప్రవహించే మూసి కారిడార్‌లో డ్రోన్ల ద్వారా యాంటి లార్వా ఆపరేసన్లు నిర్వహించడంతో సమీపంలో నివసించే వారికి దోమల బెడద తగ్గిందని స్దానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో నెలరోజ్లులో వానకాలం వస్తుండటంతో మూసీలోకి మురికి నీరు చేరి దోమల వ్యాప్తి మరింత పెరుగుతుందని, వేసవికాలంలో వాటికి సంబంధించిన పనులు చేపడితే భవిష్యత్తులో రోగాల బారిన ప్రజలు పడకుండా చేయవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. నెలరోజుల కితం వెస్ట్‌జోన్ పరిధిలో మొదటిసారి డ్రోన్ ద్వారా చెరువులో దోమల నివారణకై స్ప్రేయింగ్ చేపట్టడం సంతృప్తికర ఫలితాలు రావడంతో వారం రోజుల కితం నాగోల్ ఏరియాల్లో రెండవసారి డ్రోన్ ద్వారా ఆపరేషన్ చేపట్టడంతో అక్కడ ప్రజలు ఇన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కొంత పరిష్కారం చూపినట్లు ఎంటమాలజీ అధికారులు వివరిస్తున్నారు.

మూసినది ప్రవహించే అత్తాపూర్ నుండి నాగోల్ వరకు మూసినదిలో ఉన్న చెట్ల పొదలు, వ్యర్దాలను జెసిబిల ద్వారా తొలగించి డ్రోన్‌ల సహకారంతో యాంటీ లార్వా రసాయనాల స్ప్రే చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. అత్తాపూర్ నుంచి చాదర్‌ఘాట్ వరకు దోమల వ్యాప్తి చెందకుండా 126కార్మికులతో కూడిన 42 ఎంటమాలజి బృందాలు కృషి చేస్తున్నట్లు ఆ విభాగం అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీకి చెందిన 642 ఎంటమాలజీ బృందాలు గుర్తించిన 117 సున్నిత ప్రాంతాల్లో దోమల వ్యాప్తికి కారకమయ్యే లార్వా ఉత్పత్తి కేంద్రాల్లో నివారణ కోసం స్ప్రేయింగ్‌ను పెద్ద ఎత్తున చేపడుతామన్నారు. గతంలో డెంగ్యూ, మలేరియా కేసులు నమోదైన బస్తీల్లో ముందుస్తుగా పెరిత్రియంను కూడా స్ప్రే చేశారనన్నారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రాంతాలపై ముందస్తు నివారణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ ఖాళీ కుండలతో పాటు నీరు నిల్వలు ఉండే ప్లాస్టిక్ డ్రమ్‌లు, డబ్బాలు, నల్లాగుంతలు, పాతటైర్లలో నీటిని తొలగించే కార్యక్రమం చేయనున్నట్లు చెబుతున్నారు. ఎంటమాలజీ విభాగం సిబ్బంది ప్రతిరోజు గృహాలను పరిశీలించి వీటిలో దోమల ఉత్పత్తికి దోహదపడే ప్రాంతాలు, నీటి నిల్వలను గుర్తించి వాటిలో నీటి తొలగించి యాంటి లార్వా చర్యలు చేపడుతున్నట్లు, వారం క్రమం తప్పకుండా యాంటీ లార్వా మందులను పిచికారీ చేసేందుకు సిద్దమైతున్నట్లు పేర్కొంటున్నారు.
గ్రేటర్ లో 47 చెరువుల్లో దోమల నివారణ చర్యలు:  గ్రేటర్ చెరువుల్లో తీవ్రంగా మారిన గుర్రపు డెక్క తొలగింపు, దోమల నివారణకు బల్దియా కొత్త విధానాలు తీసుకొస్తుంది. చెరువుల్లో, కుంటల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకు తొలగించడంతో పాటు చెరువుల్లో దోమల వ్యాప్తి చెందకుంగా యాంటీ లార్వా,ఫాగింగ్‌లను చేపట్టారు. దోమల వ్యాప్తికి ప్రదాన కారకంగా ఉన్న 47 చెరువుల్లో నివారణ చర్యలు చేపడుతున్నట్లు ఎంటమాలజీ అధికారులు పేర్కొంటున్నారు. వీటిలో 15చెరువుల్లో గుర్రపుడెక్క ఆకు తొలగింపు, యాంటీ లార్వా ఆపరేషన్లు, లార్వాను తినివేసేందుకు 513 చెరువులు, కుంటలు, నీటి గుంతల్లో 58,323 గంబూసియా చేపలను వదిలినట్లు వివరిస్తున్నారు. 150పోర్టబుల్, 13వాహనాల ఫాగింగ్ మిషన్ల ద్వారా ప్రతి రోజు సుమారు 40వేల ఇళ్లలో దోమల నివారణ ఫాగింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.

 

Reduced mosquitoes with larvae operation

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూసికారిడార్‌లో యాంటి లార్వా ఆపరేషన్‌తో తగ్గిన దోమల బెడద… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.