రెడ్‌మి నుంచి నోట్ 9 సిరీస్

  న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి వచ్చిన నోట్ సిరీస్ ఫోన్లు అందరికీ చిరపరిచితమే. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లకు దేశంలో మంచి డిమాండ్ ఉంది. రెడ్‌మి నోట్ 4జి తో మొదలై.. ఈ సిరీస్‌లో నోట్ 8, నోట్ 8ప్రో వరకు వచ్చాయి. తాజాగా ఈ సిరీస్‌లో నోట్ 9 త్వరలో రాబోతోంది. మార్చి 12న జరిగే కార్యక్రమంలో నోట్ 9 […] The post రెడ్‌మి నుంచి నోట్ 9 సిరీస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి వచ్చిన నోట్ సిరీస్ ఫోన్లు అందరికీ చిరపరిచితమే. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లకు దేశంలో మంచి డిమాండ్ ఉంది. రెడ్‌మి నోట్ 4జి తో మొదలై.. ఈ సిరీస్‌లో నోట్ 8, నోట్ 8ప్రో వరకు వచ్చాయి. తాజాగా ఈ సిరీస్‌లో నోట్ 9 త్వరలో రాబోతోంది. మార్చి 12న జరిగే కార్యక్రమంలో నోట్ 9 సిరీస్ ఫోన్లను విడుదల చేయనున్నారు. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ఈ ఫోన్లను విడుదల చేయనున్నట్లు ఫావోమి ఇండియా ఎండి మనుకుమార్ జైన్ వెల్లడించారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ఫోన్‌ను ట్వీజ్ చేస్తూ ఒక పోస్టర్‌ను పోస్టు చేశారు. దీని ప్రకారం ఈ ఫోన్‌లో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. ఇదివరకు వచ్చిన నోట్ 8 సిరీస్‌లో క్వాడ్ కెమెరా అమర్చినప్పటికీ నోట్ 9 సిరీస్‌లో దీర్ఘచతురస్రాకారంలో కెమెరా సెటప్‌ను తీసుకు వస్తున్నారు. ఇది ఐఫోన్ ప్రో 11ను పోలి ఉంటుంది. గతంలో లాగానే నోట్9తో పాటుగా నోట్ 9ప్రోను కూడా ఒకే సారి విడుదల చేయనున్నారు. స్నాప్‌డ్రాగన్ 720 జి ప్రాసెసర్‌తో దీన్ని తీసుకు వచ్చే అవకాశం ఉంది. దేశీయంగా చైనా కంపెనీలైన రియల్ మి ఐక్యూ బ్రాండ్లు ఇప్పటికే 5జి ఫోన్లను విడుదల చేశాయి.దీంతో తామూ రేస్‌లో ఉన్నామనంటూ నోట్ 9 ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు షావోమి ప్రకటించడం గమనార్హం.

Xiaomi Redmi Note 9, Note 9 Pro launch on March 12

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రెడ్‌మి నుంచి నోట్ 9 సిరీస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: