12 నుంచి రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్ సేల్ ప్రారంభం

Redmi

 

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ త్యారీ సంస్థ షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో నోట్ 9 ప్రొ, నోట్ 9 ప్రొ మ్యాక్స్ పేరిట రెండు నూత్న స్మార్ట్‌ఫోన్ల్ను మార్చిలో భార్త్‌లో విడుద్ల చేసిన విషయం తెలిసిందే. రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను విక్రయించేందుకు సంస్థ ఏర్పాట్లు చేసింది. మే 12వ తేదీ నుంచి నోట్ 9 ప్రొ మ్యాక్స్ ఫోన్ల ఫస్ట్ సేల్ ప్రారంభంకానుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో స్మార్ట్‌ఫోన్లను విక్రయించేందుకు కంపెనీ సిద్ధమైంది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా రెడ్‌జోన్లలో ఫోన్లను విక్రయించకూడదని నిర్ణయించింది. నూతన మోడల్ ఫోన్లు కంపెనీ వెబ్‌సైట్ ఎంఐ డాట్‌కామ్(mi.com), అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు. మే 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్‌సేల్ మొదలుకానుంది. రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్ మూడు వేరియంట్లలో లభించనుంది.

Redmi Note 9 Pro Max First Sale Set for May 12

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 12 నుంచి రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్ సేల్ ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.