అల్పపీడనం, రుతుపవనాల తీవ్ర ప్రభావం

కేరళ లోని ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ మహారాష్ట్ర, గోవా, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు కూడా విస్తరించే ప్రమాదం,  కర్నాటకకు మరోసారి వరద ముప్పు న్యూఢిల్లీ : అరేబియా, బంగాళాఖాతం సముద్రాల్లో అల్పపీడనం కేంద్రీకృతం కావడంతో దక్షిణ రాష్ట్రాల తీర ప్రాంతాలన్నిటికీ భారీ వర్షాల ముప్పు ముంచుకొస్తోంది. ప్రస్తుతం కేరళలో భారీ వర్షాలు కురుస్తుండగా, కర్ణాటకలో నెల రోజులు కాకుండానే మళ్లీ వర్షాల ముప్పు సమీపిస్తోంది. కేరళలోని ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించగా, కర్నాటకలో శని, […] The post అల్పపీడనం, రుతుపవనాల తీవ్ర ప్రభావం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కేరళ లోని ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్
మహారాష్ట్ర, గోవా, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు కూడా విస్తరించే ప్రమాదం,  కర్నాటకకు మరోసారి వరద ముప్పు

న్యూఢిల్లీ : అరేబియా, బంగాళాఖాతం సముద్రాల్లో అల్పపీడనం కేంద్రీకృతం కావడంతో దక్షిణ రాష్ట్రాల తీర ప్రాంతాలన్నిటికీ భారీ వర్షాల ముప్పు ముంచుకొస్తోంది. ప్రస్తుతం కేరళలో భారీ వర్షాలు కురుస్తుండగా, కర్ణాటకలో నెల రోజులు కాకుండానే మళ్లీ వర్షాల ముప్పు సమీపిస్తోంది. కేరళలోని ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించగా, కర్నాటకలో శని, ఆదివారం నుంచి కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ నెలంతా వర్షాల కాలంగా కర్నాటక తల్లడిల్లుతోంది. కేరళలోని కొన్ని రైలు సర్వీసులు రద్దు చేశారు. కర్నాటకలో ఈ వారం అంతా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ రెండు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, గోవా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు లక్షద్వీపాలకు కూడా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు సంభవిస్తాయని తుపాను వాతావరణం కమ్ముకొస్తోందని వాతావరణ అధికార యంత్రాంగం హెచ్చరించింది.

ఈశాన్య రుతు పవనాలు కేరళలో ఉధృతంగా మారడంతో ఏడు జిల్లాల్లో సోమవారం రెడ్ అలెర్టు ప్రకటించారు. కేరళ దక్షిణ ప్రాంతంతోపాటు మహారాష్ట్రలో కూడా భారీ నుంచి మహాభారీగా విపరీతంగా కుండపోత వర్షాలు కురుస్తాయని, కేరళ ప్రకృతి వైపరీత్యాల నివారణ యాజమాన్య సంస్థ సోమవారం ప్రకటించిన రెడ్ అలెర్టు ప్రకారం తిరువనంతపురం, అలప్పుఝా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్, పలక్కడ్, జిల్లాలతోపాటు మంగళవారం మరో నాలుగు జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. ఎక్కడైతే ఉధృతంగా ఉంటుందని హెచ్చరించారో ఆయా ప్రాంతాల వారు తక్షణమై సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వస్తుందని, ఎమర్జెన్సీ కిట్లు కూడా అందించాల్సి ఉంటుందని హెచ్చరికలు చేశారు.

భారత వాతావరణ విభాగం హెచ్చరికల ప్రకారం ఆగ్నేయ అరేబియా సముద్ర తీరానికి ఆనుకుని మహారాష్ట్ర, గోవా కర్నాటక, కేరళ తీరాలతో పాటు లక్షద్వీప్, కొమొరిన్ ప్రాంతాల్లో ఈదురు గాలులతోపాటు భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే నైరుతి దిశగా పశ్చిమ కేంద్ర బంగాళాఖాతం తీర ప్రాంతాల్లోను, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల్లో ఈదురు గాలులుతోపాటు భారీ వర్షాలు కురుస్తాయి. కోచిలో భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల నీరు నిల్చిపోయింది. చాలా ప్రాంతాలు వాననీటి వరద ముంపునకు గురయ్యాయి. సోమవారం ఉదయం పోలింగ్‌కు ఆటంకం ఏర్పడింది.

మోకాలి లోతు నీళ్లలో నడిచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్ల వలసి వచ్చింది. చాలా ప్రదేశాల్లో రవాణా సాగలేదు. ఐఎండి వివరాల ప్రకారం దక్షిణ ఎర్నాకులంలో అత్యధికంగా 20 సెంమీ వర్షం కురిసింది. కొట్టాయంలో వైకోమ్‌లో 19 సెంమీ, అలపుఝా,మన్‌కొంపుల్లో 17 సెంమీ వంతున, కోచిలో 16 సెంమీ, కొజాలో 15 సెంమీ, పునలూరు, కంజీరపల్లిల్లో 12 సెంమీ వంతున, కొన్నిలో 11 సెంమీ వంతున వర్షపాతం నమోదైంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్సకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

రైలు పట్టాలపై నీళ్లు.. రైళ్ల సర్వీసులు రద్దు

రైలు పట్టాలు నీటితో నిండిపోడంతో దక్షిణ రైల్వే సోమవారం ఎర్నాకులంకెఎస్‌ఆర్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను, కన్నూర్‌ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసింది. అలాగే మంగళవారం నాటి బెంగళూరు ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసింది.
సోమవారం 12 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. తిరువనంతపురం కన్నూరు జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, అలాగే మంగళవారం నాటి కన్నూరు తిరువనంతపురం జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది.

పర్యాటక కార్యక్రమాలపై ఆంక్షలు

తిరువనంతపురం జిల్లా లోని కొండప్రాంతాలు, కోస్తా తీర ప్రాంతాల్లో మరో 48 గంటలపాటు పర్యాటక కార్యక్రమాలు, ఏవీ జరపరాదని ఆంక్షలు విధించారు. తీర ప్రాంతాలు, డ్యామ్‌ల పరిసరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కర్నాటకకు మళ్లీ భారీ వర్షాల ముప్పు

భారీ వర్షాల వరద నీటితో నెల రోజుల క్రితం అతలాకుతలమైన కర్నాటకకు మళ్లీ వరద ముప్పు ముంచుకొస్తోంది. శని, ఆదివారాల్లో కర్నాటక, మధ్య, ఉత్తరాది ప్రాంతాలు ఎడతెరిపిలేని వర్షాలతో సతమతమయ్యా యి. ఈ వారం అంతా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం రాత్రి ఇటీవల ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షాలు కురిశాయి. అనేక గ్రామాలు వర్షం నీటి ముంపులో తేలియాడాయి. బెలగవి, ధార్వాడ్, చిక్మగళూరు తదితర జిల్లాల్లో అకస్మాత్తుగా వరద నీటి ముంపు ముంచుకురావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోకక్, రామ్‌దుర్గ తాలూకాల్లో కొండచరియలు ప్రమాదం పొంచి ఉంటోంది.

అక్టోబర్ నెలంతా వర్షాలమయం కావడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. సాధారణ వర్ఫపాతం 50 మిమీ నుంచి 100 మిమీ కాగా, అనేక ప్రాంతాల్లో 150 నుంచి 160 మిమీ వరకు వర్ఫపాతం నమోదైంది. ధార్వాడ్, దేవనగరె జిల్లాల్లో గత రెండు రోజులుగా 50 నుంచి 60 మిమీ వర్షం కురిసిందని కర్నాటక స్టేట్ నేచరల్ డైసాస్టర్ మోనిటరింగ్ సెంటర్ (కెఎస్‌ఎన్‌ఎమ్‌డిసి) డైరక్టర్ జిఎస్ శ్రీనివాస రెడ్డి చెప్పారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం కేంద్రీకృతం కావడంతో మబ్బులు విస్తరించి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. చెన్నై సముద్ర తీరంలో మరో అల్పపీడనం కేంద్రీకృతమైందని దీనివల్ల కర్నాటక దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో తుపాను వాతావరణం కమ్ముకొస్తోందని చెప్పారు. ఈ రెండు అల్పపీడనాల ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

Red alert in seven districts of Kerala

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అల్పపీడనం, రుతుపవనాల తీవ్ర ప్రభావం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: