మార్కెట్లోకి రియల్‌మి 5 సిరీస్ ఫోన్లు

Realmy

 

ప్రారంభ ధర రూ.9,999

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మి మరో రెండు స్మార్ట్ ఫోన్లను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. రియల్ మి 5ప్రో, రియల్‌మి 5 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్లు నాలుగు కెమెరాలు కలిగి ఉంటాయి. ఇంకా రూ.10వేలలోపు మొబైల్ శ్రేణిలో నాలుగు కెమెరాలు ఉన్న ఏకైక ఫోన్ రియల్ మి5గా రికార్డు సృష్టించింది. రియల్ 5ప్రో మూడు వేరియంట్లలో లభించనుంది. 4జిబి ర్యామ్ +64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధరను రూ.13,999గా నిర్ణయించారు.

6జిబి ర్యామ్+64జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 8జిబి ర్యామ్+128జిబి అంతర్గత మెమొరీ ఉన్న మొబైళ్ల ధరలను వరుసగా రూ.14,999, రూ.16,999గా ఉన్నాయి. ఇక రియల్‌మి 5 ప్రారంభ ధర రూ.9,999 కాగా(3జిబి ర్యామ్+32జిబి ఇంటర్నల్‌స్టోరేజ్), 4జిబి ర్యామ్/64జిబి వేరియంట్ 10,999గా, 4జిబి ర్యామ్ /128జీబీ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. సెప్టెంబరు 4 నుంచి ఈ ఫోన్లను ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, రియల్ మి.కామ్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి.

Realmy 5 Series phones to the market

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మార్కెట్లోకి రియల్‌మి 5 సిరీస్ ఫోన్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.